Kodali Nani : అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు.. బీజేపీ, జనసేన ఉనికిలో లేని పార్టీలు : కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబును తన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు..

Kodali Nani : అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు.. బీజేపీ, జనసేన ఉనికిలో లేని పార్టీలు :  కొడాలి నాని
Kodali Nani
Follow us
Venkata Narayana

| Edited By: Shiva Prajapati

Updated on: Jun 27, 2021 | 8:45 PM

AP Minister Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబును తన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. గత పదేళ్లుగా వైఎస్ జగన్‌ వ్యక్తిత్వంపై ఎల్లో మీడియా దాడులు చేస్తోందని.. పార్టీలో చేరడానికి కండిషన్స్‌ పెట్టే దుస్థితి సీఎం జగన్‌కు లేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో అందరూ స్వచ్చందంగానే చేరారని.. ఎల్లో మీడియా పిచ్చిరాతలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కోర్టుల్లో పరువునష్టం దావా వేస్తామని మంత్రి హెచ్చరించారు.

ఎస్ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్న కొడాలి… రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలన సాగుతోందని.. అది చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూడు నెలలకోసారి ఏపీకి వచ్చే చంద్రబాబుకు పబ్లిసిటీ కోసం దీక్షలు చేయడం అలవాటేనని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ, జనసేన రాష్ట్రం లో ఉనికిలో లేని పార్టీలన్న నాని.. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ కి ఎన్ని ఓట్లు వచ్చాయో అందరూ చూశారని చెప్పుకొచ్చారు. “టీడీపీని తొక్కి బీజేపీ రావాలని చూస్తుంది.. అందుకే టీడీపీ, బీజేపీ అలియన్స్ పార్టీలు పోటీపడి దీక్షలు చేస్తున్నాయి.. బీజేపీ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో మేము లెక్కలు తియ్యగలం” అంటూ కొడాలి ఎదురుదాడికి దిగారు.

Read also : Anjan Kumar Yadav : ‘ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా’.. : కొత్త పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంజన్ కుమార్ యాదవ్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే