AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjan Kumar Yadav : ‘ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా’.. : కొత్త పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంజన్ కుమార్ యాదవ్

ఊరురు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా.. అని చెప్పారు కొత్తగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎంపికైన మాజీ ఎంపీ అంజన్ కుమార్..

Anjan Kumar Yadav : 'ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా'.. : కొత్త పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంజన్ కుమార్ యాదవ్
Anjan Kumar Yadav
Venkata Narayana
|

Updated on: Jun 27, 2021 | 5:34 PM

Share

PCC working working president Anjan Kumar yadav : ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా.. అని చెప్పారు కొత్తగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎంపికైన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానం ఇచ్చినందుకు ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంకి కృషి చేస్తా.. బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయి కి వచ్చా” అని అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. 2004 నుండి… పార్టీ లో కీలకంగా పని చేశానని, తెలంగాణ కోసం కొట్లడింది మేమేనని అంజన్ తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వండని ఆయన తెలంగాణ ప్రజలకు విన్నవించారు.

టీఆర్ఎస్ పార్టీ అర చేతిలో వైకుంఠం చూపిస్తుందని.. ప్రజల కాళ్ళు మొక్కి అయినా కేసీఆర్ అబద్దాల మాటలు విడమర్చి చెప్తామని అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. తెలంగాణ వద్దన్నోల్లు మంత్రి అయ్యారన్న ఆయన, తెలంగాణ కోసం కొట్లాడిన ఎంపిలం అధికారం కి దూరం అయ్యాము అని వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ… ఇప్పుడు అప్పుల తెలంగాణ అయ్యిందన్నారు.

బీజేపీ… టీఆర్ఎస్ రెండూ ఒకటే .. తోడు దొంగలు అని అంజన్ విమర్శించారు. “సోనియా గాంధీ ఎవరిని అధ్యక్షుడిని చేస్తే వారితో పని చేస్తాం.. కాంగ్రెస్ తిరిగి అధికారం లోకి తేవడం మా కర్తవ్యం.. తెలంగాణ ఇచ్చింది దోచుకోవడం కోసం కాదు, అన్ని వర్గాలు బాగుపడాలని” అని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Read also : Revanth Reddy : రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ.. పార్టీ సీనియర్లతోపాటు, జిల్లాల నుంచి పెద్దఎత్తున శుభాకాంక్షలు

ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్