AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy : రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ.. పార్టీ సీనియర్లతోపాటు, జిల్లాల నుంచి పెద్దఎత్తున శుభాకాంక్షలు

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టిపిసిసి) కొత్త అధ్య‌క్షులుగా నియ‌మితులైన రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు వెల్లువెత్తున్నాయి.

Revanth Reddy : రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ..  పార్టీ సీనియర్లతోపాటు, జిల్లాల నుంచి పెద్దఎత్తున శుభాకాంక్షలు
పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒంటి కాలితో లేస్తున్నారు. మీరు రాళ్లతో కొడితే, మేం చెప్పులతో కొడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు టీఆర్ఎస్ శాసనసభ్యులు.
Venkata Narayana
|

Updated on: Jun 27, 2021 | 5:08 PM

Share

TPCC Chief Revanth Reddy : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టిపిసిసి) కొత్త అధ్య‌క్షులుగా నియ‌మితులైన రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు వెల్లువెత్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ కార్యాల‌యానికి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఒక వైపైతే, రేవంత్‌రెడ్డిని క‌లిసి అభినంద‌న‌లు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజ‌య్య‌, మ‌ల్లుర‌వి, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ, అద్దంకి ద‌యాక‌ర్ , బెల్ల‌య్య‌నాయ‌క్‌, రేవంత్ రెడ్డిని క‌లిసి అభినంద‌న‌లు తెలియ‌జేసిన వారిలో ఉన్నారు.

మేడ్చ‌ల్‌, నాగ‌ర్‌క‌ర్నూలు, రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద ప‌ల్లి జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షులు నూత‌న టిపిసిసి అధ్య‌క్షులు, మంద‌కృష్ణ‌మాదిగ.. రేవంత్ రెడ్డికి ఫోన్‌లో అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఇలా ఉండగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైన‌ల్ చేసింది. సీనియర్‌ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌‌లను నియ‌మించింది.

ఇక, ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు. త‌మ‌కే పీసీపీ ప‌గ్గాలు కావాలంటూ చాలామంది రకాల ప్రయత్నాలు జరిగినా..రేవంత్ ఢిల్లీ కేంద్రంగా త‌న మార్క్ ప్ర‌య‌త్నాలు చేశారు.

చివరి వరకు రేవంత్ రెడ్డికి పోటీగా ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి. అందులో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. అయితే, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ మాత్రమే సమర్ధుడనే క్యాడ‌ర్‌తో పాటు ప‌లువురు నేత‌ల నుంచి సంకేతాలు ఢిల్లీ అధినాయ‌క‌త్వానికి వెళ్లాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో రేవంత్ వైపే కాంగ్రెస్ పెద్ద‌లు మొగ్గు చూపారు.

2023 ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ ను తెలంగాణలోకి అధికారంలోకి తీసుకొస్తానని.. కొందరు పని కట్టుకొని చేసే ఫిర్యాదులను పట్టించుకోకుండా తనకు కాస్త స్పేస్ ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కోరిన‌ట్లు సమాచారం.

Read also :  Tragedy : మంచిర్యాల జిల్లాలో విషాదం.. హైటెన్షన్ లైన్ తెగి పడటంతో ముప్పై గేదెలు మృతి.. తృటిలో భయటపడ్డ కాపరులు

Follow Us