AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueliene Fernandez: అప్పుడు ప్రేమ లేఖలు.. ఇప్పుడు బెదిరింపులు.. జాక్వెలిన్ గుట్టు రట్టు చేస్తానంటూ..

జాక్వెలిను తనను దయ్యంలా చూస్తోందని, దయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూస్తోందన్నాడు. జాక్వెలిన్‌కు తనతో ఉన్న సంబంధాలకు సంబంధించి ఆధారాలను కోర్టుకు , దర్యాప్తు సంస్థలకు ఇస్తానని తెలిపాడు. జాక్వెలిన్‌తో చాట్స్‌ , స్క్రీన్‌షాట్స్‌ , రికార్డింగ్స్‌ , విదేశీ ఆర్ధిక లావాదేవీలు , పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తానని సుఖేశ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించాడు

Jacqueliene Fernandez: అప్పుడు ప్రేమ లేఖలు.. ఇప్పుడు బెదిరింపులు.. జాక్వెలిన్ గుట్టు రట్టు చేస్తానంటూ..
Sukesh Chandrashekhar, Jacqueliene Fernandez
Basha Shek
|

Updated on: Dec 22, 2023 | 4:09 PM

Share

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఢిల్లీ జైలులో ఉన్న కేటుగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను బెదిరించడం సంచలనం రేపుతోంది. తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్‌ గుట్టురట్టు చేస్తానని హెచ్చరించాడు సుఖేశ్‌. జాక్వెలిన్‌ తనను మోసం చేసిందని , ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. జాక్వెలిను తనను దయ్యంలా చూస్తోందని, దయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూస్తోందన్నాడు. జాక్వెలిన్‌కు తనతో ఉన్న సంబంధాలకు సంబంధించి ఆధారాలను కోర్టుకు , దర్యాప్తు సంస్థలకు ఇస్తానని తెలిపాడు. జాక్వెలిన్‌తో చాట్స్‌ , స్క్రీన్‌షాట్స్‌ , రికార్డింగ్స్‌ , విదేశీ ఆర్ధిక లావాదేవీలు , పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తానని సుఖేశ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించాడు. ‘ నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. నాపై కేసులు పెడితే ఆధారాలు బయటపెడుతా’ అంటూ లెటర్లతో సుఖేశ్‌ తనను వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది జాక్వెలిన్‌. మరోవైపు సుఖేష్‌ జాక్వెలిన్‌ తనను మోసం చేసిందని ఆరోపిస్తున్నాడు. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జైలులో ఉన్నాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారించింది. సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి తాను విలువైన బహుమతులు అందుకున్న విషయం వాస్తవమేనని జాక్వెలిన్‌ ఒప్పుకుంది. అయితే అతడి అక్రమ సంపాదన గురించి తెలియదని స్పష్టం చేసింది.

ఫొటోలు వైరల్ కావడంతో..

అయితే స్వీట్‌హార్ట్‌ , బుట్టబొమ్మ అంటూ లెటర్లు రాస్తూ తనను సుఖేశ్‌ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించాడు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. గ్యాంగ్‌స్టర్‌ సుకేశ్‌ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరు సైతం ఉంది. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పలుసార్లు జాక్వెలిన్‌ను విచారించింది. ఇందులో ప్రధాన నిందితుడు సుకేశ్‌, జాక్వెలిన్‌ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక విచారణ సమయంలో జాక్వెలిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు సుకేశ్‌ ఈడీ అధికారులకు తెలిపాడు. దీంతో జాక్వెలిన్‌ను సైతం కేసులో నిందితురాలిగా చేర్చారు.

ఇవి కూడా చదవండి

నటి జాక్వెలిన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

వరుణ్ ధావన్ తో జాక్వెలిన్ స్టెప్పులు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..