AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dunki 1st Day Collections: ‘డంకీ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. పఠాన్, జవాన్ రికార్డ్స్ షారుఖ్ బ్రేక్ చేశాడా ?..

ఇప్పుడు 'డంకీ' సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు బాద్ షా. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న హిందీలో విడుదలైంది. ఇందులో తాప్సీ పన్నూ, విక్కీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమా బాక్సాఫీస్ అంతగా సెన్సెషన్ సృష్టించలేకపోయింది. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

Dunki 1st Day Collections: 'డంకీ' ఫస్ట్ డే కలెక్షన్స్.. పఠాన్, జవాన్ రికార్డ్స్ షారుఖ్ బ్రేక్ చేశాడా ?..
Dunki Movie
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2023 | 10:55 AM

Share

బాలీవుడ్ బాద్ షా ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‏తో ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలం తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు షారుఖ్. ఈ రెండు సినిమాలు దాదాపు రూ.1000 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ‘డంకీ’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు బాద్ షా. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న హిందీలో విడుదలైంది. ఇందులో తాప్సీ పన్నూ, విక్కీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమా బాక్సాఫీస్ అంతగా సెన్సెషన్ సృష్టించలేకపోయింది. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ముఖ్యంగా ఈ ఏడాది షారుఖ్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కూడా డంకీ సినిమాకు రాలేదు.

ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం రూ.30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే జవాన్, యానిమల్, పఠాన్, టైగర్ 3, గదర్ 2 , ఆదిపురుష్ తర్వాత ఈ ఏడాది ఏడవ అతిపెద్ద కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు రూ.89.5 కోట్లు రాబట్టగా.. పఠాన్ సినిమా రూ.57 కోట్లు రాబట్టింది. కానీ ఈ రెండు సినిమాల కంటే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టింది డంకీ. ఈ ఏడాదిలో విడుదలైన ఆదిపురుష్ సినిమా సైతం తొలిరోజు రూ.36 కోట్లు రాబట్టింది. గురువారం డంకీ సినిమా మొత్తం 29.94% ఆక్యుపెన్సీ అందుకుంది. NCR ప్రాంతంలో సుమారు 31% ఆక్యుపెన్సీతో 1412 షోలు ఉన్నాయి. ముంబైలో 1081 షోలు ఉన్నాయి. ఇది దాదాపు 29.75% ఆక్యుపెన్సీ ఉన్నట్లు. డంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

అయితే డంకీ సినిమా మొదటి రోజు కేవలం రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టడంతో సలార్సినిమాకు లైన్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది. ఉదయం నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తే మొదటి రోజే సలార్ భారీ రికార్డ్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఏడాదిలో షారుఖ్ నటించిన సినిమాల్లో అత్యంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇదే. 2018లో ఆయన నటించిన జీరో సినిమా రూ.19.35 కోట్లతో నిర్మించగా.. మొత్తం రూ.90 కోట్లు రాబట్టింది. ఇక డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి కెరీర్‏లో అత్యంత తక్కువ వసూళ్లు చేసిన సినిమా ఇదే. గతంలో ఆయన తెరకెక్కించిన సంజు సినిమా రూ.34 కోట్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us