ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌కు మాతృవియోగం.. ముంబైలో తుది శ్వాస విడిచిన స్నేహలత దీక్షిత్
Madhuri Dixit Mother: బాలీవుడ్ నుండి మరో బ్యాడ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ హిందీ సినీ నటి మాధురీ దీక్షిత్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాధురి తల్లి స్నేహలతా దేశ్‌ముఖ్ కన్నుమూశారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణం తర్వాత బాలీవుడ్ నుండి మరో బ్యాడ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ హిందీ సినీ నటి మాధురీ దీక్షిత్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాధురి తల్లి స్నేహలతా దేశ్‌ముఖ్ కన్నుమూశారు. తల్లి మరణంతో మాధురి కుటుంబం పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ముంబైలోని ఆమె స్వగృహంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని వెల్లడించారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే స్నేహలత మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
మాధురీ దీక్షిత్ తల్లి మార్చి 12, 2023 ఉదయం 8.40 గంటలకు మరణించారు. నటి తల్లి వయస్సు 91 సంవత్సరాలు. మాధురీ దీక్షిత్ తన తల్లికి చాలా సన్నిహితంగా ఉండేది. అటువంటి పరిస్థితిలో ఆమె మరణం మాధురీని తీవ్రంగా కలచివేసింది. మాధురీ దీక్షిత్ గత ఏడాది జూన్‌లో తన తల్లి 90వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన తల్లి పుట్టినరోజును జరుపుకుంటున్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లితో జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కుమార్తెలకు తల్లికి మించిని ఆప్త మిత్రులు లేరని పేర్కొన్నారు. తనకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మాధురి పోస్ట్ పెట్టారు. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
