AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen : తీవ్రమైన గుండెపోటును గెలిచిన హీరోయిన్.. ర్యాంప్ వాక్ చేసి అలరించిన అందమైన తార..

గుండెపోటు నుంచి కోలుకున్న అనంతరం కొద్ది రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న ఆమె.. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ X FDC (ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ర్యాంప్ వాక్ పై మెరిసింది.

Sushmita Sen : తీవ్రమైన గుండెపోటును గెలిచిన హీరోయిన్.. ర్యాంప్ వాక్ చేసి అలరించిన అందమైన తార..
Sushmita Sen
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2023 | 10:45 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ సుస్మిత సేన్ ఇటీవల తీవ్రమైన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సుస్మిత ఇటీవల సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేయడంతో అభిమానులు షాకయ్యారు. ఎప్పుడూ ఫిట్ నెస్ పై శ్రద్దచూపుతూ.. వర్కవుట్స్ అంటూ ఫాలోవర్లకు సూచనలు అందించే సుస్మిత ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు షాకయ్యారు. తన గుండెలో ప్రధాన ధమని 95 శాతం బ్లాక్ అయ్యిందని.. ఆ కారణంగానే తనకు హార్ట్ అటాక్ వచ్చిందని.. కానీ తనకు స్టంట్ అమర్చేందుకు యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చిందని ఇటీవల సుష్మిత చెప్పుకొచ్చారు. గుండెపోటు నుంచి కోలుకున్న అనంతరం కొద్ది రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న ఆమె.. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ X FDC (ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ర్యాంప్ వాక్ పై మెరిసింది.

ప్రముఖ డిజైనర్ అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన అందమైన ఎల్లో లెహంగాను ధరించి లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ పై వాక్ చేసి అలరించింది. పసుపు రంగు లెహంగాలో చేతిలో బోకే పట్టుకుని చిరునవ్వుతో నడిచి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పూర్తి ఆరోగ్యంగా సుస్మిత కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ .. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సుస్మిత సినిమాల విషయానికి వస్తే.. గత 7 సంవత్సరాలుగా ఆమె వెండితెరపై కనిపించలేదు. కానీ ప్రస్తుత ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తుంది. ఇటీవల ఆమె ఆర్య వెబ్ సిరీస్ లో నటించింది. రామ్ మాధవని రూపొందించిన ఈ సిరీస్ లో ఆమె కీలకపాత్ర పోషించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి..! ఆ ప్రాంతాల్లో గజ గజ..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నారింజ తొక్కలను పారేస్తున్నారా? ఆగండి.. మీ ఆరోగ్యాన్ని, అందాన్ని
నారింజ తొక్కలను పారేస్తున్నారా? ఆగండి.. మీ ఆరోగ్యాన్ని, అందాన్ని
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే
గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే
మనోజ్ బాజ్‌ పాయ్‌ కొత్త సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం
మనోజ్ బాజ్‌ పాయ్‌ కొత్త సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం