AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు అదే పెద్ద మైనస్.. అయినా కూడా 40 ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నా: శుభలేఖ సుధాకర్

టాలీవుడ్ విలక్షణ నటుడు శుభలేఖ సుధాకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు తెలుగులో అత్యధిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ నటనా ప్రస్థానం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నాకు అదే పెద్ద మైనస్.. అయినా కూడా 40 ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నా: శుభలేఖ సుధాకర్
Subhalekha Sudhakar
Rajeev Rayala
|

Updated on: Jun 02, 2026 | 8:15 PM

Share

సుదీర్ఘ నటనానుభవం ఉన్న నటుడు శుభలేఖ సుధాకర్ తన సినీ ప్రస్థానం, ఎదురైన అనుభవాలపై ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ పట్ల తాను పూర్తిగా సంతృప్తి చెందకపోయినా, “ఓకే” అని భావిస్తున్నానని, చాలా మంది ఈ పరిశ్రమలో నిలబడలేకపోయినా తాను ఇంకా నటుడిగా కొనసాగుతుండటమే గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. సుధాకర్ గారు మాట్లాడుతూ, తన వ్యక్తిత్వం ప్రారంభ దశల్లో తన కెరీర్‌కు పెద్ద మైనస్‌గా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఆ రోజుల్లో హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్ వంటి పాత్రలకు సరైన రూపురేఖలు, వ్యవహార శైలి ఉండేవని, వాటికి తన వ్యక్తిత్వం సరిపోదని భావించారని వివరించారు. హిందీ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకోవడం వల్ల భాషపై పట్టు సాధించడానికి సమయం పట్టిందని, ఇది కూడా ఒక లోపంగా మారిందని అన్నారు. “నా పర్సనాలిటీ అన్నది నాకు చాలా పెద్ద మైనస్” అని అప్పట్లో అందరూ అనేవారని, ఇది తనను వెనకడుగు వేసేలా చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

అయితే, 40 ఏళ్లుగా తాను నటుడిగా కొనసాగుతుండటాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇదే తన జీవనాధారమని, తన వృత్తి తనకు అన్నం పెడుతోందని పేర్కొన్నారు. తన వ్యక్తిత్వమే ఇప్పుడు తన కెరీర్ కొనసాగడానికి ఒక అడ్వాంటేజ్‌గా మారి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. పాత్రల ఎంపిక తన చేతుల్లో ఉండదని, రచయితలు లేదా దర్శకులు తనలో వైవిధ్యాన్ని చూసి అవకాశం ఇస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. కమల్ హాసన్ గారి ‘ద్రోహి’ చిత్రంలో తనకు అలాంటి విభిన్నమైన పాత్ర లభించిందని, దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారని గుర్తు చేశారు.

నటన రంగంలో అర్హత కంటే అదృష్టం చాలా ముఖ్యమని సుధాకర్ గారు నొక్కి చెప్పారు. జీవితంలో ప్రతిదానికీ అదృష్టం అవసరమని, మంచి తల్లిదండ్రులు దొరకడం నుంచి అనుకున్న కీర్తి ప్రతిష్టలు సంపాదించడం వరకు అదృష్టం కీలకమని అన్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు గారి మాటలను గుర్తుచేస్తూ.. “గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే లాభం లేదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి” అని చెప్పారు. ఒక నటుడికి టాలెంట్ కంటే అదృష్టం ఉంటేనే కొనసాగగలరని ఆయన వివరించారు. తన కెరీర్‌లో కొన్ని లోపాలు తనలోనే ఉన్నాయని అన్నారు. నటుల రూపురేఖల పట్ల ప్రేక్షకుల అవగాహనలు మారుతూ ఉంటాయని, ఒకప్పుడు “కొంచెం లావు ఎక్కువే, బాగుంటుంది” అనేవారని, ఇప్పుడు “కొంచెం తగ్గండి సార్, బాగుంటుంది” అంటున్నారని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us