AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా – కపిల్ శర్మ

Kapil Sharma: అందరినీ నవ్వించే.. గిలిగింతలు పెట్టే కపిల్ శర్మ వెనుక దాని ఉన్న చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. తానూ గతంలో ఎంతటి మానసిక సంఘర్షణకు లోనయ్యానో చెప్పుకొచ్చాడు.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా - కపిల్ శర్మ
Kapil Sharma
Balaraju Goud
|

Updated on: Mar 12, 2023 | 1:50 PM

Share

అందరినీ నవ్వించే.. గిలిగింతలు పెట్టే కపిల్ శర్మ వెనుక దాని ఉన్న చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. తానూ గతంలో ఎంతటి మానసిక సంఘర్షణకు లోనయ్యానో చెప్పుకొచ్చాడు. త్వరలో రాబోయే చిత్రం ‘జ్విగాటో’ గురించి చర్చలో పాల్గొన్న ప్రమఖ టీవీ వ్యాఖ్యత, ‘ది కపిల్‌శర్మ షో’ ఫేమ్‌ కపిల్‌శర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. మార్చి 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 2022లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఇండియాలో వెండి తెరపైకి రావడానికి సిద్ధమైంది. ఇప్పుడు దీని ప్రమోషన్ సందర్భంగా, ఐదేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు.. తన చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు కపిల్ శర్మ.

2017లో విడుదలైన ‘ఫిరంగి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. కపిల్ శర్మ నటించింది ఇదే చివరి చిత్రం. సినిమా పరాజయం తర్వాత కపిల్ జీవితంలో ఒక కఠినమైన దశను దాటవలసి వచ్చింది. ఈ సమయంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ విషయాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, సంతోషం,దుఃఖం కాదు’ అని తాను నమ్ముతున్నానని కపిల్ శర్మ చెప్పాడు. అయితే తన సినిమా పరాజయం పాలైన తర్వాత తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకున్నానని గుర్తు చేసుకున్నారు. మరి ఆ దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. నా భావాలను పంచుకునే వారు ఎవరూ లేరు అనుకున్నాను. జీవితంలో ఎన్నో కఠినమైన దశను దాటవలసి వచ్చింది. ఈ సమయంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని కపిల్ చెప్పాడు. ఆ దశను గుర్తుచేసుకుంటూ.. దాని నుండి ఎలా బయటపడ్డాడు.. తన మనసులోని సంఘర్షణను పంచుకున్నారు. అయితే, ఇది నాకొత్తేమీ కాదు. చిన్నతనంలోనే ఎన్నో సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యానన్నారు. ఆ సమయంలో తన బాధను ఎవరు గుర్తించలేదని వేదనకు గురయ్యారు.

డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు.. యోగక్షేమాలు చూసుకోవడానికి ఎవరూ లేనప్పుడు.. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు అర్థంకాక ఒంటరిగా అయిపోయినట్టు ఉంటుందని కపిల్ శర్మ చెప్పుకొచ్చారు. నటీనటులకు ఇలాంటి ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత.. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం తెలుసుకున్నాను. ఒక నటుడు అమాయకంగా ఉన్నాడంటే దాని అర్థం అతడు తెలివితక్కువ వాడని అర్థం కాదు. అయితే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని అర్థమైందని కపిల్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us