AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : టీమిండియా కొత్త స్పిన్ కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్‌కు ముందే బీసీసీఐ సంచలన ప్రకటన

Team India : బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులేను నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Team India : టీమిండియా కొత్త స్పిన్ కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్‌కు ముందే బీసీసీఐ సంచలన ప్రకటన
Sairaj Bahutule
Rakesh
|

Updated on: Jun 02, 2026 | 9:30 PM

Share

Team India : బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులేను నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో ఇప్పటివరకు ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ కోచ్ లేకపోవడంతో ఆ లోటును భర్తీ చేస్తూ బీసీసీఐ ఈ బాధ్యతలను సాయిరాజ్‎కు అప్పగించింది. ఆటగాడిగా, కోచ్‌గా ఎంతో అనుభవం ఉన్న 53 ఏళ్ల బహుతులే రాకతో భారత స్పిన్ విభాగం మరింత బలోపేతం కానుంది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ స్పిన్నర్లను అద్భుతంగా తీర్చిదిద్దిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది.

సాయిరాజ్ బహుతులే నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్ నుంచే ఆయన తన సేవలను అందించనున్నారు. కేవలం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే కాకుండా, పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20)లో కూడా భారత స్పిన్నర్లకు ఆయన ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా భారత పిచ్‌లపై స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకం కాబట్టి, బహుతులే అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. యంగ్ స్పిన్నర్లను గుర్తించి, వారిలోని ప్రతిభను బయటకు తీయడంలో ఆయనకు మంచి పేరుంది.

కోచ్‌గా సాయిరాజ్ బహుతులేకు అపారమైన అనుభవం ఉంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆయన పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించారు. అంతకుముందు 2018 నుంచి 2021 వరకు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కూడా కీలక సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత బీసీసీఐకి చెందిన నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించారు. దేశవాళీ లీగ్స్, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఉన్న ఈ సుదీర్ఘ అనుబంధమే ఆయనను టీమిండియా కోచ్ రేసులో ముందుంచింది.

సాయిరాజ్ బహుతులే కేవలం కోచ్‌గానే కాకుండా గతంలో భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ఆయన టీమిండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు, ఎనిమిది వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. టెస్ట్ క్రికెట్‌లో 39 పరుగులు, వన్డే క్రికెట్‌లో 23 పరుగులు సాధించారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫున లెగ్ స్పిన్నర్‌గా, ఆల్‌రౌండర్‌గా అద్భుతమైన రికార్డులను నమోదు చేశారు. మైదానంలో ఆటగాడిగా ఉన్న అనుభవం ఇప్పుడు కోచ్‌గా ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడానికి ఆయనకు బాగా ప్లస్ కానుంది.

భారత జట్టు స్పిన్ కోచ్‌గా ఎంపికైన తర్వాత సాయిరాజ్ బహుతులే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీమిండియాకు కోచ్‌గా సేవలు అందించే అవకాశం రావడం తనకెంతో గర్వకారణమని, ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. “గతంలో దేశం తరఫున ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించడం నాకు ఎనలేని గర్వాన్ని ఇచ్చింది, ఇప్పుడు మళ్లీ కోచింగ్ రూపంలో భారత క్రికెట్‌కు సేవ చేసే అవకాశం రావడం చాలా స్పెషల్. జట్టులోని ఆటగాళ్లతో కలిసి పనిచేస్తూ, అన్ని ఫార్మాట్లలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు నా వంతు మద్దతు అందిస్తాను” అని బహుతులే పేర్కొన్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us