AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పదేళ్లు ప్రేమలో.. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి.. అమ్మానాన్నలు కాబోతున్న స్టార్ హీరో, హీరోయిన్లు

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో వీరు కూడా ఒకరు. సుమారు పదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ స్టార్ హీరో, హీరోయిన్లు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు.

Tollywood: పదేళ్లు ప్రేమలో.. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి.. అమ్మానాన్నలు కాబోతున్న స్టార్ హీరో, హీరోయిన్లు
Bollywood Actor
Basha Shek
|

Updated on: Jul 09, 2025 | 7:19 PM

Share

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళుతోన్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను, తన భార్య పాత్రలేఖ త ల్లిదండ్రులు కాబోతున్నారని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నాడీ క్రేజీ హీరో. రు. ‘బేబీ ఆన్ ది వే’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారీ బాలీవుడ్ దంపతులు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు బాలీవుడ్ తారలు, సినీ అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. వరుణ్ ధావన్, ఉర్ఫీ జావేద్, సునీతా రాజ్‌వర్, భూమి పెడ్నేకర్ తదితర సినీ ప్రముఖులు రాజ్‌కుమార్ రావు దంపతులకు అభినందనలు తెలిపారు. పెళ్లయిన సుమారు నాలుగేళ్ల తర్వాత రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇద్దరూ నవంబర్ 2021లో వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు, ఇద్దరూ దాదాపు 10 సంవత్సరాలు డేటింగ్ చేశారు. రాజ్‌కుమార్ రావు ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే అతని భార్య పత్రలేఖ కూడా తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో కూడా చాలా పేరు సంపాదించుకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన స్త్రీ2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది బుల్ చుక్‌ మాఫ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రాజ్ కుమార్ రావు నటించిన మరో సినిమా ‘మాలిక్’ జూలై 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావు మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడీ క్రేజీ హీరో.

రాజ్ కుమార్ రావు దంపతుల ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇక రాజ్ కుమార్ రావు భార్య పాత్రలేఖ గతేడాది వెల్డ్ వైల్డ్‌ పంజాబ్ అనే మూవీలో నటించింది. ఈ ఏడాదిలో పూలే సినిమాతో అభిమానులను ‍అలరించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా