Mirabai Chanu: ఒలంపిక్స్‏లో మీరాబాయి చాను రికార్డ్.. వెండితెరపై మధ్య తరగతి మహిళ జీవితం..

టోక్యో ఒలింపిక్స్‏లో మహిళల 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించి మన దేశపు జెండాను రెపరెపలాడించింది సైఖోమ్ మీరాబాయి చాను.

Mirabai Chanu: ఒలంపిక్స్‏లో మీరాబాయి చాను రికార్డ్.. వెండితెరపై మధ్య తరగతి మహిళ జీవితం..
Mirabai Chanu
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 04, 2021 | 11:22 AM

Mirabai Chanu: టోక్యో ఒలింపిక్స్‏లో మహిళల 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించి మన దేశపు జెండాను రెపరెపలాడించింది సైఖోమ్ మీరాబాయి చాను. ఒలింపిక్స్‏లో పతకం సాధించిన రెండో మహిళ వెయిట్ లిఫ్టర్‏గా రికార్డు సృష్టించింది మీరాబాయి. ఆమె విజయం యావత్ దేశానికి స్పూర్తినిచ్చింది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‏లోని కాచింగ్ గ్రామానికి చిన్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన మీరాబాయి చాను జీవితకథను సినిమాగా తెరకెక్కించడానికి ఇంపాల్‏కు చెందిన స్కూటి ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు మారుమూల ప్రాంతమైన మీరాబాయి ఇంటికి వెళ్లి ఒప్పందాలు చేసుకుంది స్కూటి ఫిల్మ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఈ విషయాన్ని సదరు సంస్థ చైర్ పర్సన్ మనోబి ఎంఎం ప్రకటించారు.

మీరాబాయి చాను జీవితకథను సినిమాగా తెరెక్కిస్తున్నామని.. ఈ చిత్రానికి తానే కథను సమకూరుస్తున్నట్లుగా తెలిపారు. ఓసీ మీరా దర్శకత్వం వహించనున్నారు. ఆర్కే నళిని దేవి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో మీరాభాయి చాను పాత్రలో నటించే అమ్మాయి కోసం చిత్రయూనిట్ వెతుకుంది. ఆమె ఎత్తు, వయసు, శరీరాకృతికి సరిపోయి.. ఆమె రూపానికి కాస్త సారూప్యత కలిగిన నటి కోసం తీవ్రంగా వెతుకుతుంది యూనిట్. అలాగే వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2022లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read:  Aishwarya Rai: ఐశ్యర్య రాయ్ చెల్లెనా ఏంటీ ? అచ్చం అలాగే ఉందిగా.. ఇంటర్నెట్‏ను షేక్ చేస్తున్న యువతి..

Ippudu Kaka Inkeppudu: విడుదలకు ముందే చిత్రయూనిట్‏కు షాక్.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

Janhvi Kapoor: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీదేవి తనయ.. కాబోయే వరుడు అలా ఉండాలంటూ..

Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‏పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు…