Bollywood Singer Sonu Nigam: బాలీవుడ్ సింగర్‌ సోనూ నిగమ్‌‌పై దాడి.. ముంబై మ్యూజికల్ ఈవెంట్‌లో ఘటన..

బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయనపై దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

Bollywood Singer Sonu Nigam: బాలీవుడ్ సింగర్‌ సోనూ నిగమ్‌‌పై దాడి.. ముంబై మ్యూజికల్ ఈవెంట్‌లో ఘటన..
Singer Sonu Nigam
Follow us
Venkata Chari

|

Updated on: Feb 21, 2023 | 1:13 AM

Bollywood Singer Sonu Nigam: ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌పై సోమవారం సాయంత్రం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో దాడి జరిగింది. ఓ మ్యూజికల్ ప్రోగ్రామ్‌లో గాయకుడిపై ఈ దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అతడితో పాటు ఓ స్నేహితుడు కూడా ఉన్నాడు. సోనూ నిగమ్ అంగరక్షకుడు అతన్ని రక్షించాడు. ప్రస్తుతం ఆయన చెంబూరులోని జైన్ ఆస్పత్రిలో చేరారు.

సోనూ నిగమ్‌తో జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదికపై నుంచి దిగుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సోనూ నిగమ్‌తో పాటు అతని స్నేహితుడితో గొడవకు దిగినట్లు వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ సమయంలో బాడీగార్డ్ వచ్చి సోనూ, అతని స్నేహితుడిని రక్షించాడు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా హ్యాండిల్ సమీత్ థక్కర్ ట్వీట్ చేస్తూ, “అజాన్ లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా గొంతు పెంచిన గాయకుడు సోనూ నిగమ్‌పై ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యే ప్రకాష్ ఫటర్‌పేకర్, అతని మనుషులు చెంబూర్‌లో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో దాడి చేశారు. ఈ దాడి ఆయనే చేసినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ధారణ లేదు’ అంటూ రాసుకొచ్చింది.

మీడియా కథనాల ప్రకారం, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ చెంబూర్ ఉత్సవంలో సోనూ నిగమ్‌ను కలవాలనుకున్నారు. గాయకుడిని కలవడానికి వారికి అనుమతి నిరాకరించినప్పుడు, గొడవ జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడు, అతని అంగరక్షకులు సోనూ నిగమ్‌తోపాటు అతని స్నేహితుడిని దూషించారని తెలుస్తోంది. మరోవైపు, ముంబై పోలీసుల జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు నివేదించబడలేదు. ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..