Sonu Nigam Hit Case: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యే కుమారుడు సోను నిగమ్‌పై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఎమ్మెల్యే ప్రకాష్‌ ఫటర్‌పేకర్‌ ఆధ్వర్యంలో చెంబూరు ప్రాంతంలో ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనూ నిగమ్ పాల్గొన్నారు. స్టేజ్ దిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు సోనుపై అనుచితంగా ప్రవర్తించారు.

Sonu Nigam Hit Case: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యే కుమారుడు సోను నిగమ్‌పై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
Sonu Nigam Hit Case
Follow us

|

Updated on: Feb 21, 2023 | 9:44 AM

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ ఒక కార్యక్రమంలో దాడికి గురైన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సోమవారం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో జరిగిన మ్యూజికల్ ప్రోగ్రామ్ లో సింగర్ సోనుపై దాడి చేశారు. అయితే సోనూ నిగమ్‌పై దాడి చేసిన వ్యక్తి మరెవరో కాదు ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు ఎమ్మెల్యే కొడుకుగా గుర్తించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌ ఫటర్‌పేకర్‌ ఆధ్వర్యంలో చెంబూరు ప్రాంతంలో ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనూ నిగమ్ పాల్గొన్నారు. స్టేజ్ దిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు సోనుపై అనుచితంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌ ఫటర్‌పేకర్‌ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించారని సోనూ ఆరోపించారు.

ఎమ్మెల్యే కొడుకు మొదట సోనూ మేనేజర్ సైరాతో దురుసుగా ప్రవర్తించాడు.. ఆ తర్వాత సోనూ నిగమ్ స్టేజి దిగి వస్తుండగా ఎమ్మెల్యే కొడుకు సోను నిగమ్ బాడీగార్డ్‌ని తోసి ఆపై సోనుని కూడా తోసేశాడు. ఈ గొడవలో సోనూ నిగమ్ మేస్త్రీ కుమారుడు రబ్బానీ ఖాన్ వేదికపై నుంచి కిందపడి గాయపడ్డాడు. ఈ ప్రమాద సమయంలో సోనూ ను అతని అంగరక్షకుడు రక్షించాడు. సోనూ ఈ ప్రమాదంతో డీప్ షాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన తర్వాత సోనూ నిగమ్ ఫిర్యాదు చేసేందుకు చెంబూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కొంత సేపటికి ఎమ్మెల్యే ప్రకాష్ ఫటర్‌పేకర్ కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సోనూ నిగమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ ఫటర్‌పేకర్ కుమారుడు స్వప్నిల్ ఫటర్‌పేకర్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 323, 337 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..