3 ఫోర్లు, 4 సిక్సులతో పాండ్యా సహచరుడి బీభత్సం.. 208 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై ఊచకోత.. ఫుల్ జోష్‌లో గుజరాత్ ఫ్యాన్స్..

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో, డేవిడ్ మిల్లర్ ముల్తాన్ సుల్తాన్‌ తరపున తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

3 ఫోర్లు, 4 సిక్సులతో పాండ్యా సహచరుడి బీభత్సం.. 208 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై ఊచకోత.. ఫుల్ జోష్‌లో గుజరాత్ ఫ్యాన్స్..
David Miller Psl 2023
Follow us

|

Updated on: Feb 20, 2023 | 5:15 AM

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ IPL-2023 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టైటిల్ విజయంలో దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఫినిషర్‌గా గొప్ప పని చేశాడు. దాదాపుగా ఓడిపోవాల్సిన అనేక మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. IPL-2023 వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. మిల్లర్ తన పాత రూపంలోనే కనిపిస్తాడని పాండ్యా ఆశించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లో మిల్లర్ తన హాల్‌మార్క్‌ ప్రదర్శనతో సత్తా చాటాడు.

పీఎస్‌ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున మిల్లర్ ఆడుతున్నాడు. ఈ జట్టు ఆదివారం ఇస్లామాబాద్ యునైటెడ్‌ను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంలో కూడా మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ 20 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 138 పరుగులకే ఇస్లామాబాద్‌ జట్టు ఆలౌటైంది.

208 స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచరీ..

మిల్లర్ మరోసారి తన ఫినిషర్ స్టైల్‌ను ప్రదర్శించి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి 25 బంతుల్లో 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 208గా నిలిచింది. అతడితో పాటు ఆ జట్టు కెప్టెన్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 50 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

కీరన్ పొలార్డ్ మిల్లర్‌తో కలిసి తన తుఫాన్ ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో అజేయంగా 32 పరుగులు చేశాడు. రిలే రస్సో 30 బంతుల్లో 36 పరుగులు చేశాడు. పొలార్డ్‌తో కలిసి మిల్లర్ 40 బంతుల్లో 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

గేమ్ ఛేంజ్ చేసిన ఆఫ్రిది..

మిల్లర్, రిజ్వాన్ ఇస్లామాబాద్ జట్టును బ్యాట్‌తో దుమ్మురేపారు. ఆ తర్వాత రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అబ్బాస్ అఫ్రిది మూడు ఓవర్లలో 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇస్లామాబాద్ జట్టు 17.5 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టులో, రాసి వాన్ డెర్ డస్సెన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 49 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోలిన్ మున్రో 23 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అఫ్రిదితో పాటు మహ్మద్ ఇలియాస్, ఇసానుల్లా, ఉస్మా మీర్ తలో రెండు వికెట్లు తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..