AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడే జట్టు ఇదే.. తొలి మ్యాచ్‌ నుంచి రోహిత్ మిస్.. కారణం ఏంటంటే?

IND vs AUS ODI Squad: టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే, మొదటి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అడడం లేదు.

IND vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడే జట్టు ఇదే.. తొలి మ్యాచ్‌ నుంచి రోహిత్ మిస్.. కారణం ఏంటంటే?
Rohit Sharma's Stats in 2023: భారత జట్టు 2023లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 2023లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుతమైన రిథమ్‌తో కనిపించింది. ఇప్పటి వరకు టీ20 ఇంటర్నేషనల్, వన్డే, టెస్టు సిరీస్‌లు ఏవీ ఓడిపోలేదు. ఈ సిరీస్‌లన్నింటిలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 2023లో ఇప్పటివరకు రోహిత్ శర్మ మొత్తం 2 సెంచరీలు చేశాడు.
Venkata Chari
|

Updated on: Feb 20, 2023 | 5:05 AM

Share

India vs Australia ODI 2023: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ), మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. భారత వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. కానీ, రోహిత్ శర్మ మొదటి వన్డేలో అందుబాటులో ఉండడు. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపింగ్ ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నారు. అయితే, ఈ భారత జట్టులో కేఎల్ రాహుల్ పేరు కూడా ఉంది. అతను అవసరమైతే వికెట్ కీపింగ్ బాధ్యతను కూడా నిర్వహించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తొలి వన్డేలో రోహిత్ శర్మ మిస్..

ఈ వన్డే జట్టు ప్రకటనతో పాటు బీసీసీఐ ఓ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కుటుంబ కారణాల వల్ల ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి వన్డేలో భారత జట్టు బాధ్యతలు చేపట్టనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

భారత వన్డే జట్టులో మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఆల్‌రౌండర్ కోసం భారత జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ ఎంపికలు కూడా ఉన్నాయి.

స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఈ భారత జట్టులో కుల్చా అంటే కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ కూడా ఉన్నారు. అదే సమయంలో, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు, ఫాస్ట్ బౌలింగ్ కోసం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్‌ల పేర్లను జట్టులోకి తీసుకున్నారు.

2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఇది భారత్‌లో జరగనుంది. ఆస్ట్రేలియా అత్యంత కఠినమైన జట్లలో ఒకటిగా నిలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఏ కాంబినేషన్‌తో మైదానంలోకి వస్తుందో చూడాల్సి ఉంది. రోహిత్ శర్మతో శుభ్‌మాన్ గిల్ ఓపెనింగ్ చేస్తే కేఎల్ రాహుల్‌ను 5వ నంబర్‌లో బ్యాటింగ్‌కి పంపిస్తారా? అదే సమయంలో, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌ల ఎంపిక కూడా నంబర్ 4, నంబర్ 5 కోసం అందుబాటులో ఉంటుంది. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 17న ముంబైలో, రెండో మ్యాచ్ మార్చి 19న విశాఖపట్నంలో, చివరి వన్డే మార్చి 22న చెన్నైలో జరగనుంది.

భారత వన్డే జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..