IND vs AUS: చివరి 2 టెస్టులు, వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే.. 10 ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్..
India vs Australia: 2023 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చివరి రెండు టెస్టుల కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. అలాగే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా భారత జట్టును ఎనౌన్స్ చేసింది.
India ODI Squad Announced: బోర్డర్-గవాస్కర్ 2023 సిరీస్‌లో చివరి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టీమిండియాను ప్రకటించింది. తొలి రెండు టెస్టుల్లో టీమిండియాలో భాగమైన అదే జట్టును ఎంపిక చేసింది. బ్యాడ్ ఫామ్‌తో సతమతమవుతున్న కేఎల్ రాహుల్ మిగతా రెండు టెస్టులకు కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో పాటు రిజర్వ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
కాగా, తొలి రెండు టెస్టులో కేఎల్ రాహుల్ బ్యాడ్ ఫాంతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికే భారత జట్టులో కేఎల్ రాహుల్‌ను కొనసాగించడంపై మాజీల నుంచి అభిమానుల వరకు ఫైర్ అవుతున్నారు. మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని సలహాలు ఇచ్చారు. కానీ, బీసీసీఐ మాత్రం మిగతా రెండు టెస్టులకు కేఎల్ రాహుల్‌ను కొనసాగించింది.
చివరి రెండు టెస్టులకు టీమిండియా – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
దీంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా బీసీసీఐ టీమ్‌ఇండియాను ప్రకటించింది. చాలా కాలం తర్వాత వన్డే సిరీస్ కోసం రవీంద్ర జడేజా తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. అదే సమయంలో, జయదేవ్ ఉనద్కత్ కూడా 10 సంవత్సరాల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
వన్డే సిరీస్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..