IND vs AUS: ఢిల్లీ టెస్ట్‌లో దుమ్మురేపిన టీమిండియా.. 6 భారీ రికార్డులు బ్రేక్.. అవేంటో తెలుసా?

Delhi Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది.

IND vs AUS: ఢిల్లీ టెస్ట్‌లో దుమ్మురేపిన టీమిండియా.. 6 భారీ రికార్డులు బ్రేక్.. అవేంటో తెలుసా?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Feb 20, 2023 | 8:39 AM

Team India’s Records: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాటు టీమిండియా కొన్ని కీలక రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుకుందాం..

ఆస్ట్రేలియాపై భారత జట్టుకు ఇది 32వ టెస్టు విజయం. ప్రత్యర్థి జట్లపై భారత జట్టు సాధించిన అత్యధిక టెస్టు విజయాలు ఇదే. అంతకుముందు ఇంగ్లండ్‌పై భారత జట్టు అత్యధిక టెస్టు విజయాన్ని నమోదు చేసిన రికార్డు క్రియోట్ చేసింది. ఇంగ్లండ్‌పై భారత జట్టు 31 టెస్టు విజయాలు నమోదు చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లతో సహా, ఆస్ట్రేలియాపై భారత జట్టుకు ఇది 100వ విజయం. వీటిలో 53 వన్డేలు, 32 టెస్టులు, 15 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ విజయంతో పాటు స్వదేశంలో ఓడిపోకూడదన్న ధీమాను భారత జట్టు నిలబెట్టుకుంది. భారత జట్టు తన గడ్డపై గత 44 టెస్టు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.

ఈ విజయంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కూడా భారత్ ఆధిపత్యం అలాగే ఉంది. గత 36 ఏళ్లుగా భారత్‌ ఇక్కడ ఒక్క టెస్టులోనూ ఓడిపోలేదు. గత 36 ఏళ్లలో భారత జట్టు ఇక్కడ 13 మ్యాచ్‌లు ఆడగా, అందులో 11 గెలిచి 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఢిల్లీలో ఈ విజయం గత 13 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కు 8వ విజయం. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టు కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. మిగిలిన మూడు టెస్టులు డ్రా అయ్యాయి. అదేమిటంటే.. తాజాగా ఆస్ట్రేలియాపై భారత జట్టు తన రికార్డును బలపరుస్తోంది.

ఢిల్లీ టెస్టు విజయంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. అంటే ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను డ్రా చేసుకోవచ్చని తెలుస్తుంది. కాగా, ఈ ట్రోఫీ భారతదేశం వద్దనే ఉంటుంది. ఎందుకంటే గత టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తద్వారా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..