IND vs AUS: రెండో టెస్టు పరాజయం తర్వాత ఆస్ట్రేలియాకు మరో సమస్య.. మూడో టెస్ట్‌కు దూరం కానున్న స్టార్‌ ప్లేయర్‌.?

భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్‌కు మూడో టెస్టులో మరో అంశం కలిసొచ్చేలా..

IND vs AUS: రెండో టెస్టు పరాజయం తర్వాత ఆస్ట్రేలియాకు మరో సమస్య.. మూడో టెస్ట్‌కు దూరం కానున్న స్టార్‌ ప్లేయర్‌.?
Ind Vs Aus Match
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2023 | 10:54 AM

భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్‌కు మూడో టెస్టులో మరో అంశం కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయ్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మూడో టెస్ట్‌ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్వదేశానికి వెళ్తున్నట్లు సమచారం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యక్తిగత కారణమని సమాచారం. కమిన్స్‌ కుటుంబ సభ్యుడి అనారోగ్యం కారణంగా ఆయన ఆస్ట్రేలియాకు బయలు దేరినట్లు తెలుస్తోంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4 టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 0-2తో వెనుకంజలో ఉంది. నాగ్‌పూర్‌, ఢిల్లీలో జరిగిన టెస్టుల్లో భారత్‌ మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు రెండు జట్ల ఇండోర్‌లో తదుపరి టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే అంతకుముందే కమిన్స్‌ స్వదేశానికి వెళ్లిపోవడం ఆ జట్టుకు మైనస్‌గా చెప్పొచ్చు. అయితే కమిన్స్‌ స్వదేశానికి వెళ్లినా మూడో మ్యాచ్‌లో ఆడుతాడని న్యూస్‌ కార్ప్‌ పేర్కొంది.

కమిన్స్‌ కేవలం రెండు రోజుల కోసమే సిడ్నీకి వచ్చాడని అక్కడి వార్తా సంస్థలు రాసుకొచ్చాయి. తిరిగి వెంటనే భారత్‌కు వెళ్లి.. మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరగనున్న మూడో టెస్టులో పాల్గొననున్నాడని పేర్కొంది. ఇదిలా ఉంటే సిరీస్‌లోని మొదటి రెండు టెస్టుల్లో పాట్ కమిన్స్ ప్రదర్శన అంత గొప్పగా లేదని చెప్పాలి. తొలి రెండు మ్యాచ్‌ల్లో 39.66 సగటుతో కేవలం 3 వికెట్లు తీశాడు. మరి మూడో టెస్టులో కమిన్స్‌ ఉంటాడా లేదా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు చూడాల్సిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..