Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket: తండ్రి ప్రపంచ దిగ్గజ క్రికెటర్‌.. తనయుడి కెరీర్‌ మాత్రం 11 మ్యాచ్‌లకే ముగిసింది. ఇంతకా ప్లేయర్‌ ఎవరంటే..

సునీల్‌ గవాస్కర్‌.. ఈ పేరును ఇండియన్‌ క్రికెటర్‌ లవర్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుత ఆటతీరుతో ఎంతో అభిమానులతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. 70, 80లలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు...

Indian Cricket: తండ్రి ప్రపంచ దిగ్గజ క్రికెటర్‌.. తనయుడి కెరీర్‌ మాత్రం 11 మ్యాచ్‌లకే ముగిసింది. ఇంతకా ప్లేయర్‌ ఎవరంటే..
Sunil Gavaskar
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2023 | 11:28 AM

సునీల్‌ గవాస్కర్‌.. ఈ పేరును ఇండియన్‌ క్రికెటర్‌ లవర్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుత ఆటతీరుతో ఎంతో అభిమానులతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. 70, 80లలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అనంతరం ఈ రికార్డును సచిన్‌ అధిమగించిన విషయం తెలిసిందే. ఇలాంటి స్టార్‌ ప్లేయర్‌ వారసుడు క్రికెట్‌లోకి అడగుడుపెడితే ఆయనపై అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ క్రికెట్ ప్రపంచంలో అడుగు పెట్టిన సమయంలో అతనిపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ రోహన్‌ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు. ఈరోజు రోహన్ పుట్టినరోజు.. ఫిబ్రవరి 20న 1976లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించాడు రోహన్‌. ఈ సందర్భంగా ఆయ క్రికెట్‌ జర్నీకి సంబంధించి కొన్ని వివరాలు. సునీల్ గవాస్కర్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయితే, అతని కుమారుడు రోహన్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్. టీమిండియాలో చోటు దక్కినా.. అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు.

2003-04లో ఆస్ట్రేలియా పర్యటనలో రోహన్‌కు టీమ్‌ ఇండియాలో అవకాశం లభించింది. రోహన్‌ 18 జనవరి 2004న ఆస్ట్రేలియాపై అవకాశం పొందాడు, కానీ అతను కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ఈ పర్యటనలో అతను అడిలైడ్‌లో జింబాబ్వేపై హాఫ్ సెంచరీ సాధించాడు, ఇన్నింగ్స్ 54 పరుగులు చేశాడు. రోహన్‌ కెరీర్‌లో ఇదే తొలి, చివరి హాఫ్‌ సెంచరీ అదే కావడం గమనార్హం. ఇక బౌలింగ్ విషయానికొస్తే రోహన్‌ బౌలింగ్‌లో ఆండ్రూ సమైండ్స్‌ వికెట్‌ను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ మ్యాచ్‌ తర్వాత పాకిస్థాన్ పర్యటనకు జట్టులోకి ఎంపిక కాలేదు. కానీ 2004-05 సీజన్ ప్రారంభంలో మళ్లీ అతనికి అవకాశం దక్కింది. ఆ తర్వాత 5 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈ మ్యాచ్‌ల్లో కూడా రోహన్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక 2004 సెప్టెంబర్‌ 19వ తేదీన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ రోహన్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌. రోహన్ భారతదేశం తరపున మొత్తం 11 వన్డే మ్యాచ్‌లు ఆడగా 151 పరుగులు చేశాడు. అతని పేరు మీద ఒక వికెట్ కూడా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..