Team India: బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ దంచుడే.. రికార్డులు చూస్తే పరేషానే.. ఆల్‌రౌండర్‌గా మారిన ప్లేయర్.. ఎవరంటే?
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ టెస్ట్ సిరీస్‌లో దుమ్మురేపాడు.
Ravichandran Ashwin: భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు భారత క్రికెటర్ల జాబితాలో చేరాడు. బౌలింగ్‌లో అశ్విన్ తన నైపుణ్యంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. అందుకే రోజురోజుకు వికెట్లు తీస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని, అయితే బ్యాటింగ్‌లో కూడా అశ్విన్‌కు అపారమైన సత్తా ఉంది. రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాటింగ్ ఆధారంగా భారత జట్టును ఒక్కసారి కాదు చాలాసార్లు కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఈ కారణంగా, అతను టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో రవీంద్ర జడేజా తర్వాత నంబర్-2 స్థానంలో ఉన్నాడు. అతను అత్యుత్తమ ఆల్ రౌండర్ కావడం ఇప్పుడు మరో కొత్త రికార్డు ద్వారా ధృవీకరణ అయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అశ్విన్ ప్రత్యేక రికార్డ్..
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5000 పరుగులు, 700 వికెట్లు సాధించిన ఐదో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ ఈ రికార్డు సృష్టించాడు. రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందు, భారతదేశానికి చెందిన చాలా మంది వెటరన్ ఆల్ రౌండర్ ఆటగాళ్లు ఈ స్థానాన్ని సాధించారు.
వినోద్ మన్కడ్: ఈ జాబితాలో వినోద్ మన్కడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 11,591 పరుగులు చేశాడు. 782 వికెట్లు కూడా తీసుకున్నాడు.
శ్రీనివాస్ వెంకటేశరాఘవన్: శ్రీనివాస్ వెంకటేశరాఘవన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 6,617 పరుగులు చేయడంతో పాటు 1390 వికెట్లు తీశాడు.
కపిల్ దేవ్: భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ పేరు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. కపిల్ దేవ్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 11,356 పరుగులు చేయడంతోపాటు 835 వికెట్లు తీశాడు.
అనిల్ కుంబ్లే: ఈ జాబితాలో భారత గ్రేట్ మాజీ బౌలర్ అనిల్ కుంబ్లే పేరు నాలుగో స్థానంలో ఉంది. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో కుంబ్లే 5572 పరుగులతో పాటు 1,136 వికెట్లు తీశాడు.
రవిచంద్రన్ అశ్విన్: ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ పేరు ఐదవ స్థానంలో ఉంది. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 5002 పరుగులతో 702 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..