అలాంటి వార్తలు రాసి మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోకండి.. స్టార్ హీరో సీరియస్ వార్నింగ్..
కొద్దిరోజులుగా మలైకా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నారు. బీటౌన్ లోనూ ఈ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రూమర్స్ పై హీరో అర్జున్ కపూర్ ఘాటుగానే స్పందించారు.
బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా చాలా కాలంగా రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరద్దరి బంధం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ పూకార్లను గతంలో మలైకా కొట్టిపారేసింది. ఇక కొద్దిరోజులుగా మలైకా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నారు. బీటౌన్ లోనూ ఈ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రూమర్స్ పై హీరో అర్జున్ కపూర్ ఘాటుగానే స్పందించారు. సదరు ఆర్టికల్ స్క్రీన్ షాట్ ను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. సీరియస్ అయ్యారు.
మీరు క్యాజువల్ గా తీసుకుని రాసే రాతలు.. మాకు ఎంత సెన్సిటివ్ గా అనిపిస్తుందో తెలుసా ?.. ఇలాంటి చెత్త న్యూస్ ఎలా రాస్తున్నారు.. ఇదే కాదు.. చాలా వార్తలను ఈ జర్నలిస్ట్ ఇలాగే రాశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి నిజాన్ని నొక్కేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగదు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం మీకెక్కడిది. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ పోస్ట్ సో షల్ మీడియాలో వైరలవుతుంది.
అర్జున్, మలైకా గత 3 సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా ఇద్దరూ 2019 సంవత్సరంలో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. 2023లో ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.