Asha Saini: పోర్నోగ్రఫి కేసులోకి నన్ను లాగడం చాలా బాధగా ఉంది, ఒక్కసారైనా ఆలోచించారా.? క్లారిటీ ఇచ్చిన ఆశా సైనీ..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jul 27, 2021 | 7:18 PM

Asha Saini: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోర్న్‌ వీడియోలు చిత్రీకరించి యాప్‌ ద్వారా విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్‌ అయిన....

Asha Saini: పోర్నోగ్రఫి కేసులోకి నన్ను లాగడం చాలా బాధగా ఉంది, ఒక్కసారైనా ఆలోచించారా.? క్లారిటీ ఇచ్చిన ఆశా సైనీ..
Asha Saini Raj Kundra

Asha Saini: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోర్న్‌ వీడియోలు చిత్రీకరించి యాప్‌ ద్వారా విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్‌ అయిన రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు 14 రోజుల పాటు జ్యూడిషియల్‌ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ పోర్న్‌ రాకెట్‌కు సంబంధించి మరికొంత మంది పేర్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ నటి ఆశాసైనీ పేరు కూడా బయటకు రావడం సంచలనంగా మారింది. ఉమేష్‌ కామత్‌, రాజ్‌కుంద్రా మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌లో ఆశాసైనీ పేరు రావడంతో ఈ అంశం కాస్త హాట్‌ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ మీడియాలో ఈ అంశంపై వార్తలు వస్తున్నాయి. దీంతో ఆశాసైనీ ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేసి తన వెర్షన్‌ను తెలిపారు ఆశాసైనీ.

న్యూస్‌ ఛానల్స్‌లో తనపై వస్తోన్న వరుస కథనాలపై స్పందించిన ఆశాసైనీ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ రాజ్‌ కుంద్రాతో మాట్లాడలేదని తెలిపారు. అందుకే ఈ విషయంపై స్పందించకూడదని అనుకున్నానని, కానీ తనను దోషిగా చూపిస్తున్నారని అనిపించడంతో మాట్లాడుతున్నానని తెలిపారు. పోర్న్‌ రాకెట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆశిసైనీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘నేను ఒక నటిని, ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడ ఉండైనా మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడిన దాంట్లో నా పేరును ఒక్కసారి ప్రస్తావిస్తే నాకు ఈ రాకెట్‌కు సంబంధం ఉందని అంటారా’ అని ఆశిసైనీ ప్రశ్నించారు. ‘నాకు సినిమా కుటుంబ నేపథ్యం లేదు. నా ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా నా పేరు, నన్ను ఈ కేసులోకి లాగడం బాధగా ఉంది. ఇలాంటి తీవ్రమైన పోర్న్ కేసులోకి ఒక మహిళను లాగితే వారి జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా’? అని ఆశా సైనీ ప్రశ్నించారు. అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారు కాబట్టే క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియోను రిలీజ్‌ చేస్తున్నానని తెలిపారు. మరి ఈ వివాదం ఇంకెక్కడి వరకు వెళుతుందో చూడాలి. ఇదిలా ఉంటే నటి ఆశా సైనీ తెలుగులో నువ్వు నాకు నచ్చావు, చాలా బాగుంది, 143, నర్సింహ నాయుడు, ప్రేమతో రాతో పాటు మరెన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

ఆశా సైనీ పోస్ట్‌ చేసిన వీడియో..

View this post on Instagram

A post shared by Flora Saini (@florasaini)

Also Read: Seerath Kapoor: ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్.. అలనాటి ఫ్యాషన్ దుస్తులతో మెరిసిన ముద్దుగుమ్మ..

Pawan – Rana: సంక్రాంతికి ఛార్జ్‌ తీసుకోనున్న బిమ్లా నాయక్‌.. పవన్‌ – రానాల సినిమా మేకింగ్ వీడియో చూశారా.?

NTR – Rajamouli: రాజమౌళి పని రాక్షసుడే కాదు.. అప్పుడప్పుడు ఇలా కూడా. వైరల్‌గా మారిన ఎన్టీఆర్‌ – రాజమౌళి వీడియో.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu