NTR – Rajamouli: రాజమౌళి పని రాక్షసుడే కాదు.. అప్పుడప్పుడు ఇలా కూడా. వైరల్‌గా మారిన ఎన్టీఆర్ – రాజమౌళి వీడియో.
NTR Rajamouli: సినిమాలను అత్యంత జాగ్రత్తగా ఒక శిల్పం చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టే రాజమౌళిని జక్కన్నగా పిలుచుకుంటారు. సన్నివేశాన్ని 100 శాతం పక్కాగా వచ్చే వరకు వదలరు రాజమౌళి. ఈ క్రమంలోనే...
NTR Rajamouli: సినిమాలను అత్యంత జాగ్రత్తగా ఒక శిల్పం చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టే రాజమౌళిని జక్కన్నగా పిలుచుకుంటారు. సన్నివేశాన్ని 100 శాతం పక్కాగా వచ్చే వరకు వదలరు రాజమౌళి. ఈ క్రమంలోనే నటీనటులను బాగా కష్టపెడుతంటారు. ఈ విషయాన్ని యాక్టర్‌లు కూడా అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇటీవల రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోలో ఎన్టీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజమౌళి పని రాక్షసుడు అంటూ సంభోదించిన విషయం తెలిసిందే. ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా పనే పరమావధిగా పనిచేస్తుంటారు రాజమౌళి. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో మాత్రం ఆయన పనే కాదు అప్పుడప్పుడు చిత్ర యూనిట్‌తో సరాదాగా కూడా గడుపుతాడు అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవలే కరోనా నిబంధనలు సడలించడంతో మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు రాజమౌళి. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ షూటింగ్ స్పాట్‌లో సరదగా గడిపారు. రాజమౌళి, ఎన్టీఆర్‌తో సహా కొందరు వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. దీనంతటినీ అక్కడే ఉన్న వారెవరో సీక్రెట్‌గా రికార్డ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మునుపెన్నడూ ఎన్టీఆర్ ఇలా గేమ్స్ ఆడుతూ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను అందించడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆర్.ఆర్.ఆర్ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఆగష్టు 1వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న చిత్రయూనిట్ తెలిపింది. ‘దోస్తీ’ అనే పేరుతో సాగనున్న ఈ పాట ఐదు భాషల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సింగర్లతో దీనిని రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ ఇవ్వగా.. కీరవాణీ మ్యూజిక్ అందించారు.
Hero @tarak9999 playing volleyball with @ssrajamouli ❤❤❤. pic.twitter.com/MXybRAjfG5
— Sai Mohan #JrNtr #RRR ? (@Sai_Mohan_999) July 26, 2021
Raj Kundra Case: టార్గెట్ రూ.34 కోట్లు.. రాజ్ కుంద్రా పోర్న్ బిజినెస్ ప్లాన్స్..సంచలన విషయాలు