Kudi Yedamaithe – Aha OTT: సంచలనం సృష్టిస్తున్న ‘కుడి ఎడమైతే’.. ఇండియా స్పాట్‏లైట్ ట్రెండింగ్‏‏లో అమలాపాల్ వెబ్ సిరీస్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 27, 2021 | 5:26 PM

ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తోంది. కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ క్రమంగా పెరుగుతుంది.

Kudi Yedamaithe - Aha OTT: సంచలనం సృష్టిస్తున్న 'కుడి ఎడమైతే'.. ఇండియా స్పాట్‏లైట్ ట్రెండింగ్‏‏లో అమలాపాల్ వెబ్ సిరీస్..
Kudi Yedamaithe

ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తోంది. కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ క్రమంగా పెరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడూ బ్లాక్ బస్టర్ మూవీతోపాటు..సూపర్ హిట్ వెబ్ సిరీస్ అందిస్తూ.. ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నాయి ఓటీటీ సంస్థలు. అయితే తెలుగు ప్రేక్షకుల కోసం సరికొత్త వినోదాన్ని అందిస్తూ.. ఇతర ఓటీటీలకు ధీటుగా పోటినిస్తుంది తొలి తెలుగు మాధ్యమం ఆహా. ఇటీవల “కుడి ఎడమైతే” ప్రెస్టీజియస్ సిరీస్‏ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటించారు. లూసియా, యూటర్న్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ పవన్ కుమార్ ఈ సిరీస్‏కు దర్శకత్వం వహించారు. జూలై 16న ఆహాలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

India Spotlight

India Spotlight

తాజాగా ఈ మూవీ ఇండియా స్పాట్‏లైట్ ట్రెండింగ్‏లో మూడవ స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో వెంకటేష్… ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన నారప్ప సినిమా ఉండగా.. రెండవ స్థానంలో బాహుబలి ది బిగినింగ్ నిలిచింది. అలాగే నాల్గవ స్థానంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ నిలవగా.. ఐదవ స్థానంలో మహేష్ బాబు వన్ నేనొక్కడినే మూవీ నిలిచింది. ప్రెస్టీజియస్ సిరీస్‏ కుడిఎడమైతే అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగింది. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న అమలాపాల్, డెలివరీ బాయ్‏గా పనిచేస్తున్న రాహుల్ విజయ్ జీవితాలలో ఒకే రోజు జరిగిన కొన్ని పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి.. వీరిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటీ ? అంటూ సాగిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మరో హిట్‏ను తన ఖాతాలో వేసుకుంది.

Also Read: Sneha-Prasanna: సినిమాల్లోనే కాదు.. యాడ్స్‏లోనూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. స్నేహ దంపతులు ఎంత సంపాదించారో తెలుసా..

TS Theaters: తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల పై హైకోర్టులో విచారణ..

Rajeev Kanakala: సుమతో విభేదాల రూమర్స్‏కు చెక్ పెట్టిన రాజీవ్ కనకాల.. నిజంగానే విడిగా ఉండాల్సి వచ్చిందంటూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu