AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Deluxe: టాలీవుడ్‌ ఆడియన్స్‌కు మరో ట్రీట్‌ ఇవ్వనున్న ఆహా.. ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగులో సూపర్‌ డీలక్స్‌..

Super Deluxe In Telugu: సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, ప్రోగ్రామ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది 'ఆహా' ఓటీటీ. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌గా ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఆహా...

Super Deluxe: టాలీవుడ్‌ ఆడియన్స్‌కు మరో ట్రీట్‌ ఇవ్వనున్న ఆహా.. ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగులో సూపర్‌ డీలక్స్‌..
Super Deluxe In Aha
Narender Vaitla
|

Updated on: Jul 27, 2021 | 8:48 PM

Share

Super Deluxe In Telugu: సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, ప్రోగ్రామ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ‘ఆహా’ ఓటీటీ. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌గా ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఆహా ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తూనే ఉంది. ఇటీవల ఆహా వేదికగా విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ ఊహించని విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టైమ్‌ లూప్‌ అనే వినూత్న కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇదిలా ఉంటే తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు చూపించే క్రమంలో ఇప్పటికే ఆహా కొన్ని సినిమాలను డబ్‌ చేసి విడుదల చేసింది. వీటిలో ఇటీవల నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నీడ’ సినిమా ఒకటి. ఇక తమిళంలో సంచలన విజయం సాధించిన మరో చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ను తెలుగులో తీసుకొస్తోంది ఆహా.

విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌ డీలక్స్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ కోసం ప్రేక్షకులను ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరిందరి కోరిక మేరకే సూపర్‌ డీలక్స్‌ను తెలుగులో తీసుకొస్తున్నామంటూ ‘ఆహా’ తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. సూపర్‌ డీలక్స్‌ తెలుగు డబ్బింగ్‌ చిత్రాన్ని ఆగస్టు 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

Also Read: RRR Audio Rights: మొదలైన జక్కన్న రికార్డుల వేట.. దేశంలోనే అత్యధిక ధరకు ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఆడియో హక్కులు.?

Asha Saini: పోర్నోగ్రఫి కేసులోకి నన్ను లాగడం చాలా బాధగా ఉంది, ఒక్కసారైనా ఆలోచించారా.? క్లారిటీ ఇచ్చిన ఆశా సైనీ..

Pawan – Rana: సంక్రాంతికి ఛార్జ్‌ తీసుకోనున్న బిమ్లా నాయక్‌.. పవన్‌ – రానాల సినిమా మేకింగ్ వీడియో చూశారా.?