AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan – Rana: సంక్రాంతికి ఛార్జ్‌ తీసుకోనున్న బిమ్లా నాయక్‌.. పవన్‌ – రానాల సినిమా మేకింగ్ వీడియో చూశారా.?

Pawan Kalyan Rana Making Video: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి రూపంలో టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌ సినిమాకు నాందిపడిన విషయం తెలిసిందే. అత్యంత ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై...

Pawan - Rana: సంక్రాంతికి ఛార్జ్‌ తీసుకోనున్న బిమ్లా నాయక్‌.. పవన్‌ - రానాల సినిమా మేకింగ్ వీడియో చూశారా.?
Pawankalyan Rana
Narender Vaitla
|

Updated on: Jul 27, 2021 | 6:10 PM

Share

Pawan Kalyan Rana Making Video: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి రూపంలో టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌ సినిమాకు నాందిపడిన విషయం తెలిసిందే. అత్యంత ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. వీటికి అనుగుణంగానే మేకర్స్‌ కూడా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్‌ పవన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో పవన్‌ పోలీసు పాత్రలో మరోసారి గబ్బర్‌సింగ్‌ను అభిమానులకు గుర్తు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ను ఇచ్చింది. కరోనా తగ్గుముఖం పడి మళ్లీ థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఇక సినిమాకు సంబంధించిన ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తూ.. బీమ్లా నాయక్‌ సంక్రాంతికి ఛార్జ్‌ తీసుకోనున్నాడు అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇక ఈ మేకింగ్‌ వీడియోలో పవన్‌తో పాటు రానా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీవ్‌ చేశారు. ముఖ్యంగా పోలీస్‌ గెటప్‌లో పవన్‌ ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి ఈ మేకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇదిలా ఉంటే మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రచన అందిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Also Read: NTR Rajamouli: రాజమౌళి పని రాక్షసుడే కాదు.. అప్పుడప్పుడు ఇలా కూడా. వైరల్‌గా మారిన ఎన్టీఆర్‌, రాజమౌళి వీడియో.

Kudi Yedamaithe – Aha OTT: సంచలనం సృష్టిస్తున్న ‘కుడి ఎడమైతే’.. ఇండియా స్పాట్‏లైట్ ట్రెండింగ్‏‏లో అమలాపాల్ వెబ్ సిరీస్..

Prabhas Kriti Sanon: సీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆదిపురుష్‌… కృతిపై పొగడ్తలు కురిపించిన ప్రభాస్‌.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి