అరుదైన ఫోటో షేర్ చేసిన పాపులర్ సింగర్.. అమ్మతో నేను అంటున్న ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టండి..

ఇటీవల స్టార్ సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో

అరుదైన ఫోటో షేర్ చేసిన పాపులర్ సింగర్.. అమ్మతో నేను అంటున్న ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టండి..
Singer

ఇటీవల స్టార్ సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో నెట్టింట్లో తమకు సంబంధించిన అరుదైన ఫోటోస్ షేర్ చేస్తూ.. లైవ్ చాటింగ్స్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, రష్మిక మందన్నా, సాయి పల్లవి, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. తాజాగా పాపులర్ సింగర్ తన చిన్ననాటి ఫోటోను తన ఇన్‏స్టాలో షేర్ చేశారు. పైన ఫోటోలో తన తల్లి ఒడిలో ఉన్న ఈ క్యూట్ పాప ఇప్పుడో పాన్ ఇండియా లెవల్లో టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టండి.

Singers

తన పాటలకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా భాషతో సంబంధం లేకుండా.. ఎన్నో పాటలకు తన గానంతో ప్రాణం పోశారు. దాదాపు 19 ఏళ్లుగా తన గాత్రంలో కొన్ని వేల పాటలతో శ్రోతలను అలరిస్తున్నారు. గుర్తుపట్టారా ? మీకు ఒక చిన్న క్లూ కూడా చెప్పేస్తాను. ఇటీవలే పడ్డంటి బాబుకు జన్మనిచ్చారు కూడా. చెప్పుకోండి చూద్దాం.

Untitled 1

తన గానంతో సంగీత ప్రియుల్ని మాయలో పడేస్తుంది. నమ్మిన నా మది మంత్రాలయమేగా అంటూ శ్రోతల మనసులను తాకుతుంది. తెలుగులో ఎన్నో పాటలను ఆలపించి.. అన్ని భాషల ప్రేక్షకులను తన స్వరంతో అలరించి.. బ్లాక్ బస్టర్ సింగర్‏గా నిలిచింది. తను మరెవరో కాదు.. శ్రేయా ఘోషల్.. షారుఖ్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, మాధురీ దీక్షిత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘దేవదాస్‌’ చిత్రంతో తన గాన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన శ్రేయా.. ఇప్పటికీ తన గానంతో దేశ వ్యాప్తంగా శ్రోతలను అలరిస్తుంది.

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

Also Read: Kudi Yedamaithe – Aha OTT: సంచలనం సృష్టిస్తున్న ‘కుడి ఎడమైతే’.. ఇండియా స్పాట్‏లైట్ ట్రెండింగ్‏‏లో అమలాపాల్ వెబ్ సిరీస్..

NTR – Rajamouli: రాజమౌళి పని రాక్షసుడే కాదు.. అప్పుడప్పుడు ఇలా కూడా. వైరల్‌గా మారిన ఎన్టీఆర్‌ – రాజమౌళి వీడియో.

 

Click on your DTH Provider to Add TV9 Telugu