Prabhas Kriti Sanon: సీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆదిపురుష్‌… కృతిపై పొగడ్తలు కురిపించిన ప్రభాస్‌.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jul 27, 2021 | 4:29 PM

Prabhas Kriti Sanon: మహేష్‌ బాబు హీరోగా నటించిన 'వన్‌.. నెనొక్కడినే' సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా...

Prabhas Kriti Sanon: సీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆదిపురుష్‌... కృతిపై పొగడ్తలు కురిపించిన ప్రభాస్‌.
Prabha Kritisanon

Prabhas Kriti Sanon: మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ. తెలుగులో మరోసారి ‘దోచేయ్‌’ సినిమాతో తళుక్కుమన్న ఈ చిన్నది మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇక ఒక్కసారిగా భారీ ప్రాజెక్టులో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఈ చిన్నది ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సినిమాలో సీత పాత్రలో బడా హీరోయిన్ల పేర్లు వినిపిచ్చినప్పటికీ చివరకు ఈ అవకాశం కృతి సనన్‌ను వరించింది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ఇక ఈ అందాల భామ పుట్టిన రోజు నేడు (మంగళవారం). ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులతో పాటు సినీ తారలు కూడా పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా కృతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రాముడి పాత్రలో నటిస్తోన్న ప్రభాస్‌.. సీత పాత్రలో నటిస్తోన్న కృతి సనన్‌కు విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా చీర కట్టులో దిగిన కృతి ఫొటోను షేర్‌ చేసిన ప్రభాస్‌.. ‘కృతి సనన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆదిపురుష్‌ షూటింగ్‌ సెట్‌లోకి మీరు తీసుకొచ్చిన ఉత్సాహం వెలకట్టలేనిది’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున కృతికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Om Raut (@omraut)

ఇక ఆదిపురుష్‌ సినిమా దర్శకుడు ఓం రౌత్‌కు కూడా కృతికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కృతితో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘కలిసి పంచుకున్న ఎన్నో సంభాషణలు, నవ్వులు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. అయితే చిత్ర యూనిట్‌ కృతి పుట్టిన రోజున మాత్రం సీతమ్మ పాత్రకు సంబంధించిన ఎలాంటి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయకపోవడం గమనార్హం. ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీతో పాటు దేశంలోని ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. కరోనా కారణంగా కొన్నాళ్లుగా వాయిదా పడ్డ చిత్ర షూటింగ్‌ తాజాగా తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన సైప్‌ అలీఖాన్‌ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Raj Kundra Case: అమ్మ దొంగా.. అరెస్టును ముందే పసిగట్టిన రాజ్ కుంద్రా..పాత ఫోన్‌ను ఏం చేశారంటే?

Pragya Jaiswal: లాక్‌డౌన్‌ జీవితంపై ప్రగ్యా జైస్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు .. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిందంటూ వేదాంతం

TS Theaters: తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల పై హైకోర్టులో విచారణ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu