Raj Kundra Case: టార్గెట్ రూ.34 కోట్లు.. రాజ్ కుంద్రా పోర్న్ బిజినెస్ ప్లాన్స్..సంచలన విషయాలు

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 27, 2021 | 5:24 PM

Raj Kundra Case: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు.

Raj Kundra Case: టార్గెట్ రూ.34 కోట్లు.. రాజ్ కుంద్రా పోర్న్ బిజినెస్ ప్లాన్స్..సంచలన విషయాలు
Raj Kundra

Raj Kundra Case: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. పోర్నోగ్రఫీ ద్వారా సముపార్జించే ఆదాయ వివరాలను, వారి లక్ష్యాలను ఈ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ పోర్న్ కంటెంట్ ద్వారా బోలీఫేమ్ మీడియా లిమిటెడ్‌ రూ .146,00,00,000 స్థూల ఆదాయం, రూ .30,42,01,400 నికర లాభం సాధించండం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసులు తమ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. హాట్ షాట్ ఇబ్బందుల్లో పడితే..ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ బి ని కూడా రాజ్‌ కుంద్రా సిద్ధం చేసుకున్నారని చార్జిషీట్‌లో అధికారులు పేర్కొన్నారు.

కాగా, ఈ ఛార్జ్ షీట్‌లో పోర్నోగ్రఫీ వీడియోల ద్వారా ఏ సంవత్సరానికి ఎంత స్థూల ఆదాయం, ఎంత నికర ఆదాయాన్ని అంచనాగా పెట్టుకున్నారనే వివరాలను క్లుప్తంగా పేర్కొన్నారు. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి స్థూల రాబడి, నికర లాభాల వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం.. 2021-22 సంవత్సరానికి సంబంధించి స్థూల ఆదాయం రూ.36,50,00,000 .. నికర లాభం రూ .4,76,85,000  గా పేర్కొన్నారు. 2022-23కి స్థూల ఆదాయం సుమారు రూ. 73,00,00,000  కాగా, అంతే మొత్తంలో నికర లాభాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 2023-24కి సంబంధించి స్థూల ఆదాయం రూ .1,46,00,00,000 , నికర లాభం రూ.30,42,01,400 గా పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాఫిట్స్.. బోలీఫేమ్‌కి చెందినదా? మరేదైనా కంపెనీకి చెందినదా? అనే అంశంపై ఈ చార్జిషీట్‌లో క్లారిటీ ఇవ్వలేదు.

‘‘కామత్ నుంచి పలు కీలక డీక్యూమెంట్స్ స్వాధీనం చేసుకున్నాం. మొదటి చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో బోలీఫేమ్‌కు సంబంధించి మరింత స్పష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ అదనపు సమాచారాన్ని అనుబంధ చార్జిషీట్‌లో పొందుపరుస్తాం.’’ అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు.

క్రైమ్ బ్రాంచ్ అధికారుల ప్రకారం.. రాజ్‌ కుంద్రా భారతదేశం నుంచి బోలీఫేమ్‌ను నిర్వహించారు. అలాగే హాట్ షాట్ నుంచి చాలా కంటెంట్‌ను బోలీఫేమ్‌కు బదిలీ చేయడం జరిగింది. కాగా, రాజ్ కుంద్రా కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న సర్వర్‌ను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించిన తరువాత, పోర్నోగ్రఫీ కంటెంట్ అప్‌లోడ్‌కు సంబంధించి మరింత స్పష్టత లభిస్తుందని అధికారులు తెలిపారు. కుంద్రా యాజమాన్యంలోని వయాన్ ఇండస్ట్రీస్, జెఎస్ స్ట్రీమింగ్ కార్యాయాల్లో జులై 20వ తేదీన జరిపిన దాడుల సందర్భంగా కీలక సర్వర్లను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే.. హాట్ షాట్ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో.. కామత్, రాజ్ కుంద్రా, ప్రదీప్ బక్షి మధ్య వాట్సాప్ చాట్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ చాట్‌లో బోలీఫేమ్ రూపంలో ‘ప్లాన్‌ బి’ ని సిద్ధం చేసుకున్నట్లు గుర్తించారు. వీరు కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన హాట్‌షాట్ కంటే ఎక్కువ ఆదాయం, సబ్‌స్క్రిప్షన్స్ తీసుకువస్తామని చెప్పి బోలీఫేమ్‌లో ప్రముఖులను లైవ్ స్ట్రీమ్‌లోకి తీసుకురావాలని వారు ప్రయత్నించినట్లు చార్జిషీట్‌లో అధికారులు పేర్కొన్నారు.

నటి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు.. ఈ కేసులో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడం కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నటి షెర్లిన్ చోప్రాను సాక్షిగా పిలిచారు. గత ఏడాది నవంబర్‌లో హాట్‌షాట్‌తో సహా వివిధ ఒటిటి ప్లాట్‌ఫామ్‌లపై కేసు నమోదు చేసినప్పుడు రాష్ట్ర సైబర్ సెల్‌కు వచ్చిన తొలి వ్యక్తి షెర్లిన్ చోప్రా. అయితే, ఈ విచారణలో ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా గురించి సైబర్ సెల్‌కు కీలక వివరాలను తెలియజేసినట్లు స్వయంగా షెర్లిన్ చోప్రానే వెల్లడించింది. ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా మోడల్స్, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్స్ మొదలైన వాటి కోసం కుంద్రా నేతృత్వంలోని సంస్థ యాప్స్‌ను డెవలప్ చేసి విక్రయిస్తుంటారని పేర్కొంది. ఈ క్రమంలోనే హాట్‌షాట్‌ను ఏర్పాటు చేసి దానిని 2019, డిసెంబర్ 11వ తేదీన బక్షికి విక్రయించినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట వెల్లడించింది.

విచారణకు సహకరించని రాజ్ కుంద్రా.. రాజ్ కుంద్రా కస్టడీ మంగళవారం ముగియడంతో రిమాండ్ విచారణ కోసం అతన్ని మళ్లీ కోర్టుకు హాజరుపరిచారు. కోర్టుకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత వారం అతని ఇంట్లో నుంచి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ అధికారులు.. వాటి ఆధారంగా రాజ్ కుంద్రాను మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, క్రైమ్ బ్రాంచ్ పోలీసులను వాదనను కాదని రాజ్ కుంద్రాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో రాజ్ కుంద్రా ఏమాత్రం సహకరించలేదని అధికారులు తెలిపారు.\

Also read:

Pulasa Fish: పులసా మజాకా.. వేలం పాటలో పోటీ పడీ మరి దక్కించుకున్న జనం.. ఒక్క చేప ఎంత పలికిందో తెలుసా. వీడియో..

BJP in South India: ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ.. దేశవ్యాప్తంగా హవా.. కొరకరాని కొయ్యగా సౌతిండియా!

Maharashtra Floods: మహారాష్ట్ర వరదల్లో 251 మందికి పైగా మృతి.. 100 మంది గల్లంతు.. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu