Amy Jackson: అమీ జాక్సన్ చేసిన పనికి అభిమానులు షాక్.. అసలేం జరిగిందంటూ ఆరా..

Amy Jackson: మోస్ట్ బ్యూటీఫుల్ మోడల్, నటి అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్‌లో తన ఫోటో...

Amy Jackson: అమీ జాక్సన్ చేసిన పనికి అభిమానులు షాక్.. అసలేం జరిగిందంటూ ఆరా..
Amy Jackson
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 27, 2021 | 6:15 PM

Amy Jackson: మోస్ట్ బ్యూటీఫుల్ మోడల్, నటి అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్‌లో తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. గ్లామర్ ఫోటోలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫోటోలు, ఫియాన్సీ జార్జ్ పనాయోటౌ, బేబీ ఆండ్రియాస్‌ ఫోటోలను కూడా ఇన్‌స్టాలో తరచుగా షేర్ చేస్తుంటుంది. అమీ జాక్సన్ షేర్ చేసే ఫోటోలను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, తాజాగా ఆమె అభిమానులు ఒక విషయాన్ని గుర్తించారు. అదేంటంటే.. అమీ జాక్సన్ తన ఇన్‌స్టా నుంచి కాబోయే భర్త జార్జ్ పనాయోటౌ‌ ఫోటోలను, అతనితో కలిసి ఉన్న ఫోటోలన్నింటినీ తొలగించింది. ఇది చూసి అమీ అభిమానులు షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా? విడిపోయారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అమీ జాక్సన్, ఆమె ప్రియుడు జార్జ్ పనాయోటౌ కు 2019, సెప్టెంబర్ 23వ తేదీన పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ బాబుకు ఆండ్రియాస్ అని పేరు కూడా పెట్టారు. అమీ, జార్జ్ మే 6, 2019న నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం లండన్‌లో ఒక ప్రైవేట్ ఎంగేజ్‌మెంట్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అయితే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన అమీ.. గర్భంతోనే ఫోటోలకు ఫోజులిచ్చి సంచలనం సృష్టించింది. కాగా, అమీ, జార్జ్ కి వివాహం జరగవలసి ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా.. వీరి వివాహ నిలిచిపోయింది. ఇప్పుడు జార్జ్ ఫోటోలన్నింటినీ తొలగించడంతో నెటిజన్లు, అభిమానుల్లో ఒకరమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ విడిపోయారా? అని చర్చించుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంపై అమీ ఇప్పటివరకు స్పందించలేదు.

ఇంగ్లండ్‌కు చెందిన అమీ జాక్సన్ 2010లో తమిళ దర్శకుడు తెరక్కెంచిన మద్రాసపట్నం చిత్రంతో సినిమా ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలా.. తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమీ జాక్సన్.. అనతికాలంలో తమిళం, హిందీ, తెలుగు, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0, విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమా లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటించింది. తన నటన, అందంతో భారీ స్థాయిలో అభిమానులను కూడా సంపాదించుకుంది.

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson)

Also read:

Supreme Court: బిచ్చమెత్తుకోవాలని ఎవరు కోరుకుంటారు.. భిక్షాటనపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Viral Pic: ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

AP Corona Cases: ఏపీలో దిగివస్తున్న కరోనా కేసులు.. పెరగుతున్న కోలుకున్న వారి సంఖ్య.. ఇవాళ కొత్త కేసులు ఎన్నంటే..?

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే