AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP in South India: ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ.. దేశవ్యాప్తంగా హవా.. కొరకరాని కొయ్యగా సౌతిండియా!

దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. 2019లో కూడా ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన బీజేపీకి దక్షిణాది మాత్రంకొరకరాని కొయ్యగానే మారింది.

BJP in South India: ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ.. దేశవ్యాప్తంగా హవా.. కొరకరాని కొయ్యగా సౌతిండియా!
Bhartiya Janata Party Modi And Amit Sha
Balaraju Goud
|

Updated on: Jul 27, 2021 | 5:29 PM

Share

BJP in South India: దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. 2019లో కూడా ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన బీజేపీకి దక్షిణాది మాత్రంకొరకరాని కొయ్యగానే మారింది. ఐదు రాష్ట్రాల్లో బలమైన ముద్ర వేయాలని భావిస్తున్న పార్టీ ఆశలు నీరుగారిపోతున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినా కూడా ఎందుకో కన్ఫూజన్ అక్కడ పార్టీలో వెంటాడుతోంది. యడియూరప్ప రాజీనామా అనంతరం సరైన మాస్‌ లీడర్‌ కనిపించడం లేదు. ఇటు కేరళ, తమిళనాడులో బలపడాలన్న ప్రయత్నాలను జనాలు తిప్పికొట్టారు. తెలుగురాష్ట్రాల్లో ప్రచారం చేసినంతగా ఎన్నికల్లో ఓట్లు రాలడం లేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ.. 40కోట్లకు పైగా సభ్యత్వాలు సొంతం చేసుకన్న ఏకైక జాతీయపార్టీ.. మూడున్నర దశాబ్ధాల తర్వాత సొంతంగా అధికారంలోకి వచ్చేంత మెజార్టీతో చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్‌ హఠావో నినాదంతో గుజరాత్‌ నుంచి వచ్చిన మోదీ- అమిత్‌షాల ద్వయం వరుస విజయాలతో రాష్ట్రాల్లో కూడా కమలవికాసం సాకారం చేశారు. జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా అవతరించారు.

దేశమంతా పార్టీ జెండా రెపరెపలాడుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్ధిగా ఉంది. కానీ దక్షిణాదిలో మాత్రం పార్టీ బలమైన పునాదులు ఏర్పడటం లేదు. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రశ్నించి ప్రాంతీయ పార్టీల ఉద్యమాలకు ఊపిరి పోసి.. కొత్త శకానికి నాంది పలికిన ద్రవిడ రీజియన్‌లో బీజేపీ వ్యూహాలు పారడం లేదు. తమిళనాడు మాత్రమే కాదు.. తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళలో పార్టీ ఓట్లు సీట్లు పెంచుకోవాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. కనీస ఓటు బ్యాంకు లేని బెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో పార్టీ తక్కువ సమయంలో ఓట్లు, సీట్లు సాధించినా.. 1980ల్లో ఆవిర్బావం నుంచే కొద్దోగొప్పో బలం ఉండి గతంలో మిత్రపక్షాలతో అధికారం పంచుకున్న పార్టీ తెలుగురాష్ట్రాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. ముఖ్యంగా మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తే సీట్లు.. లేకుంటే డిపాజిట్లు గల్లంతులా పరిస్థితి తయారైంది. ఇక తమిళనాడులో అన్నాడిఎంకే ద్వారా అధికారంలోకి రావాలని చూసినా ఇటీవల ప్రజలు తిప్పికొట్టారు. అటు కేరళలో శబరిమల ఉద్యమాన్ని.. ఇటు డెవపల్‌మెంట్‌ మంత్రం ప్రయోగించినా కూడా ఫలితం రాలేదు.

ఇక, పార్టీ 2006 నుంచి కర్ణాటకలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చింది. అక్కడ పార్టీకి బలమైన కేడర్‌ తయారైంది. 2008లో సొంతంగా అధికారంలోకి వచ్చినా కూడా అవినీతి ఆరోపణలు.. సీఎంల మార్పులు తప్పలేదు. 2018లో మళ్లీ మెజార్టీ సీట్లు వచ్చినా మ్యాజిక్‌ నెంబర్‌ దక్కలేదు. దీంతో పదవి కాలం పూర్తవకుండానే పడిపోయింది. ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చి మరీ పీఠం దక్కించుకున్నారు. కానీ, పూర్తికాలం కాకుండానే మళ్లీ కొత్త సీఎం వేటలో పడింది బీజేపీ. ప్రభుత్వ వ్యతిరేకతే కానీ.. ఇక్కడ స్థిరమైన ఓటుబ్యాంకు లేకపోవడం పార్టీకి మైనస్‌ అయింది. యడియూరప్ప పార్టీ వీడటంతో 2013లో చిత్తుగా ఓడిపోయింది. అంటే స్థానిక నాయకత్వం.. సామాజికవర్గం అండ తప్ప పార్టీ విధానంలో అక్కడ బలమైన ముద్ర వేయలేకపోతుందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రధానింగా సౌతిండియాలో డెవలప్‌ మెంట్‌ కోణం తప్ప.. హిందుత్వ ఎజెండా వర్కువుట్‌ కాదన్న చర్చ కొనసాగుతోంది. అదే సమయంలో పార్టీకి సరైన మాస్‌ లీడర్ల కొరత కూడా ఎదగకపోవడానికి కారణమంటున్నారు విశ్లేషకులు. మరీ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలాన్ని పెంచుకుంటుందా? ఇదే పంథాను కొనసాగిస్తుందా.? అనేది వేచి చూడాల్సిందే.. Read Also…  కర్ణాటకలో ఆ మాజీ మంత్రిపై ‘హానీ ట్రాప్’ ! ఆయనపై అభియోగాలకు ఆధారాలు లేవని నిర్ధారించిన ‘సిట్’ బృందం