RRR Audio Rights: మొదలైన జక్కన్న రికార్డుల వేట.. దేశంలోనే అత్యధిక ధరకు ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఆడియో హక్కులు.?

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jul 27, 2021 | 8:26 PM

RRR Audio Rights: సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి అగ్ర తారలు కలిసి నటిస్తుండడం...

RRR Audio Rights: మొదలైన జక్కన్న రికార్డుల వేట.. దేశంలోనే అత్యధిక ధరకు ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఆడియో హక్కులు.?
Rrr Movie Audio

RRR Audio Rights: సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి అగ్ర తారలు కలిసి నటిస్తుండడం, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం, బాహుబలి లాంటి సంచలనం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడం ఇలా ఏ కారణమం చూసుకున్నా ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇండియన్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ ముగింపు దశలో ఉన్న ఈ చిత్ర శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. ఈ డీల్‌ భారీ మొత్తంలో ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్‌, లహరి మ్యూజిక్స్‌ సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఈ సంస్థలు అధికారికంగా ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నాయి. హిందీతో పాటు దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదలవుతోన్న ఈ సినిమా ఆడియో రైట్స్‌ను అత్యంత ఎక్కువ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని విలువ సుమారు రూ. 25 కోట్ల వరకు ఉండొచ్చని టాక్‌ వినిపిస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ వార్తే కనుక నిజమైతే దేశంలో ఇప్పటి వరకు ఈ ధరకు ఓ సినిమా ఆడియో హక్కులు అమ్ముడు పోవడం ఇదే తొలిసారి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రమోషన్‌ పనులను జక్కన్న ప్రారంభించారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ తొలి లిరికల్‌ పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే దోస్తీ అనే పాటను ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ పాటకు సిరివెన్నెల రచయితగా వ్యవహరిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read: Thimmarusu Pre Release Event: ‘తిమ్మరుసు’ కోసం రంగంలోకి మరో హీరో.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్

Asha Saini: పోర్నోగ్రఫి కేసులోకి నన్ను లాగడం చాలా బాధగా ఉంది, ఒక్కసారైనా ఆలోచించారా.? క్లారిటీ ఇచ్చిన ఆశా సైనీ..

Amy Jackson: అమీ జాక్సన్ చేసిన పనికి అభిమానులు షాక్.. అసలేం జరిగిందంటూ ఆరా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu