Amitabh Bachchan: ఎనభై ఏళ్లలోనూ అదే ఫిట్నెస్.. అమితాబ్ డైట్ సిక్రెట్ ఏంటో తెలుసా..
80 ఏళ్ల వయసులోనూ అమితాబ్ ఎంతో ఉత్సాహంగా ఎనర్టీతో కనిపిస్తుంటారు. నవతరం హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తన ఫిట్ నెస్ కాపాడుకోవడంలో ముందుంటారు. అయితే ఆయన ఫిట్ నెస్.. ఎనర్జీపై అభిమానులకు
బాలీవుడ్ బిగ్ బిఅమితాబ్ బచ్చన్‌కు ఈరోజు ప్రత్యేకం. అక్టోబర్ 11న ఆయన 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దాదాపు 50 ఏళ్లకు పైగా హిందీ చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో వెండితెరపై అద్భుతాలు చేసిన మెగాస్టార్. ఓరోజ సినిమాలకు దూరంగా లేరు అమితాబ్. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నారు. మరోవైపు బిగ్ స్క్రీన్ పైనే కాకుండా.. స్మాల్ స్క్రిన్ పైన కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మెగాస్టార్‌గా ఆడియన్స్ మనసులలో నిలిచిపోయిన బిగ్ బి.. ఇప్పుడు యాంకరింగ్‌లో కొత్తదనం తీసుకువచ్చారు. కౌన్ బనేగా కరోడ్ పతి 14 ద్వారా బుల్లితెర పై సందడి చేస్తున్నారు. అయితే 80 ఏళ్ల వయసులోనూ అమితాబ్ ఎంతో ఉత్సాహంగా ఎనర్టీతో కనిపిస్తుంటారు. నవతరం హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తన ఫిట్ నెస్ కాపాడుకోవడంలో ముందుంటారు. అయితే ఆయన ఫిట్ నెస్.. ఎనర్జీపై అభిమానులకు అనేక సందేహాలుంటాయి. అసలు అమితాబ్ డైట్ సిక్రెట్ ఏంటీ అంటూ నెట్టింట సెర్చ్ చేస్తుంటారు. ఇంతకీ బిగ్ బి ఫిట్ నెస్ సిక్రెట్ తెలుసుకుందామా.
అమితాబ్ బచ్చన్ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. టీబీ, లివర్ సిర్రోసిస్ వంటి పెద్ద జబ్బులను ఎదుర్కొన్నట్లు సమాచారం. తన కాలేయం 75 శాతం పాడైందని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాకుండా రెండు సార్లు కరోనా భారిన పడ్డారు. అలాగే ఆయనకు మస్తీనియా గ్రావిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా ఉంది. తన ఆరోగ్య పరిస్థితి పట్ల బిగ్ బి ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటాడు. సిగరెట్, మద్యానికి దూరంగా ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం నుంచి అతను నాన్ వెజ్ ఫుడ్ తినడం మానేశాడు. ప్రతి రోజూ కేవలం సాధారణ ఆహారాన్ని తీసుకుంటాడు. ప్రతిరోజూ వ్యాయమం చేస్తుంటారు. యోగా, ప్రాణాయామం చేస్తారు. ఉదంయ నిద్రలేచిన తర్వాత ముందు జిమ్.. ఆ తర్వాత శరీరంలో రక్తప్రసరణ బాగా జరగడానికి ప్రతిరోజు 20 నిమిషాలపాటు వాకింగ్ చేస్తుంటారు. ఇవే కాకుండా కార్డియోపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు.
బిగ్ బి తన ఆహారంలో కేవలం స్వదేవీ వస్తువులను మాత్రమే తీసుకుంటారు. వ్యాయామంతో రోజును ప్రారంభిస్తారాు. ఖర్జూరం, ఆపిల్, అరటి పండ్లు తీసుకుంటారు. ఉదయం అల్పహారంగా గంజి, ఎగ్ బుర్జి, పాలు, ప్రోటిన్ డ్రింక్, బాదం మాత్రమే తీసుకుంటారట. ఇక జామకాయ రసం, తులసి ఆకులు, కొబ్బరి నీరు తీసుకుంటారు. మధ్యాహ్నం సింపుల్ ఫుడ్ తీసుకుంటారట. చపాతీలు, పప్పు, కూరగాయలు మాత్రమే. ఇక రాత్రి భోజనానికి లైట్ సూపర్ తీసుకోవడం బిగ్ బికి ఇష్టమట. రాత్రి భోజనంలోకి పన్నీర్ బుర్జి తీసుకుంటారు. ఇప్పటికీ అమితాబ్ ఆల్కహల్ తీసుకోరు. ఇవే కాదు.. టీ, కాపీ, కూల్ డ్రింక్స్ తీసుకోరు. తనకు చాట్ అంటే చాలా ఇష్టమని గతంలో అనేకసార్లు చెప్పారు బిగ్ బి. అలాగే బెంగాలి స్వీట్స్ కూడా ఇష్టంగా తినేస్తాడట.