AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: “అందుకోసం చాలా ప్రయత్నించాను.. కానీ కుదరలేదు”.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Vijay Deverakonda: అందుకోసం చాలా ప్రయత్నించాను.. కానీ కుదరలేదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..
Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2022 | 7:29 AM

Share

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండకు యూత్‏లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఈ హీరోకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో మెప్పించిన విజయ్.. ఇటీవల మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్‏గా మారాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో విజయ్ బాక్సార్ పాత్రలో నటించి మెప్పించాడు. ఎన్నో అంచనాలతో ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విజయ్ నటనకు సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వచ్చినా.. కంటెంట్ పై విమర్శలు వచ్చాయి. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో చిత్రయూనిట్ పై దారుణంగా ట్రోల్స్ నడిచాయి. లైగర్ సినిమా అనంతరం మీడియా ముందుకు తక్కువ వచ్చాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన సైమా అవార్డ్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ 2022లో యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియా సినిమా అవార్డు సొంతం చేసుకున్నాడు విజయ్. అయితే ఈ అవార్డు తీసుకున్న తర్వాత రౌడీ ఇచ్చిన స్పీచ్‏కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో విజయ్ మాట్లాడుతూ.. ” ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. గొప్ప సినిమాలు, అద్భుతమైన పెర్ఫామెన్స్‏తో మీరు ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నాను. అందుకు చాలా ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. మనందరికీ మంచి, చెడు రోజులు వస్తాయి. ఏ రోజుల్లోనైనా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులు కచ్చితంగా.. చాలా జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ వేడుకకు రాకూడదనుకున్నాను. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్పాలని వచ్చాను. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ప్రస్తుతం రౌడీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాస్ గెలిచిన భారత్.. గెలిస్తే ఫైనల్ పోరు..
టాస్ గెలిచిన భారత్.. గెలిస్తే ఫైనల్ పోరు..
ఫ్లైట్‌లో ఆస్తమా ఎటాక్‌కు గురై ప్రయాణికుడు మృతి
ఫ్లైట్‌లో ఆస్తమా ఎటాక్‌కు గురై ప్రయాణికుడు మృతి
బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్: ప్రోటీన్ దేనిలో ఎక్కువ? బరువు తగ్గడానికి
బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్: ప్రోటీన్ దేనిలో ఎక్కువ? బరువు తగ్గడానికి
అబ్బబ్బ.. దీని రుచికి ఇంకేదీ సాటిరాదు.. పోషకాల రోటి పచ్చడి..
అబ్బబ్బ.. దీని రుచికి ఇంకేదీ సాటిరాదు.. పోషకాల రోటి పచ్చడి..
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..