AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GodFather: చిరంజీవి సినిమాను ఎంజాయ్ చేసిన తలైవా.. గాడ్ ఫాదర్ చిత్రానికి రజినీకాంత్ రివ్యూ.. ఏమన్నారంటే..

అక్టోబర్ 10న సోమవారం తలైవా గాడ్ ఫాదర్ చిత్రాన్ని వీక్షించారని.. అది మర్చిపోలేని అనుభవమంటూ డైరెక్టర్ మోహన్ రాజా ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. సినిమాను ఆదరించినందుకు తలైవాకి ధన్యవాదాలు తెలిపారు.

GodFather: చిరంజీవి సినిమాను ఎంజాయ్ చేసిన తలైవా.. గాడ్ ఫాదర్ చిత్రానికి రజినీకాంత్ రివ్యూ.. ఏమన్నారంటే..
Rajinikanth, God Father
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2022 | 10:50 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏తో దూసుకుపోతుంది. మలయాళీ హిట్ లూసీఫర్ రీమేక్‍గా వచ్చిన ఈ మూవీకి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. పొలిటికల్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ చిత్రానికి సూపర్ స్టా్ర్ రజినీకాంత్ రివ్యూ ఇచ్చేశారు. ఈ సినిమాను తలైవా ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 10న సోమవారం తలైవా గాడ్ ఫాదర్ చిత్రాన్ని వీక్షించారని.. అది మర్చిపోలేని అనుభవమంటూ డైరెక్టర్ మోహన్ రాజా ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. సినిమాను ఆదరించినందుకు తలైవాకి ధన్యవాదాలు తెలిపారు.

” సూపర్ స్టార్ రజినీకాంత్ గాడ్ ఫాదర్ చిత్రాన్ని చూశారు. చాలా బాగుంది అన్నారు. తెలుగు వెర్షన్ కోసం చేసిన అనుసరణలను గురించి ఆయన ప్రశంసించారు. చాలా చాలా ధన్యావాదాలు సర్. నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది కూడా ఒకటి ” అంటూ రాసుకొచ్చారు మోహన్ రాజా. ఇందులో చిరు చెల్లెలిగా నయన్ కనిపించగా.. అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించారు.

ఇక ఇటీవలే ఈ మూవీ సక్సెస్ మీట్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు డైరెక్టర్ మోహన్ రాజా తన తదుపరి సినిమా అక్కినేని నాగార్జునతో ఉండనుందని.. వీరిద్దరి కాంబోలో వచ్చే ప్రాజెక్ట్ మల్టీస్టారర్ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో అక్కినేని అఖిల్ సైతం నటించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!