Amitabh bachchan: ఇది కదా సక్సెస్ అంటే.. గొంతు బాలేదని రిజక్ట్ చేశారు, నేడు ఆ గొంతే ఓ బ్రాండ్..
భారతీయ చలన చిత్ర పరిశ్రమ గురించి ఇంకో 100 ఏళ్ల తర్వాత ప్రస్తావన వచ్చినా అమితాబ్ పేరు లేకుండా పూర్తి కాదనడంలో సందేహమే లేదు. అంతలా చెరగని ముద్ర వేసిన అమితాబ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటన మీకోసం..

అమితాబ్ బచ్చన్.. ఈ పేరు తెలియని సగటు ఇండియన్ సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి సందేహం ఉండదు. భారతీయ సినిమా చరిత్రలో బిగ్‌బిది చెరగని సంతకం. ఆయన పేరే ఓ చరిత్ర. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆయనకు లక్షలాది మంది అభిమానులు. అమితాబ్ స్ఫూర్తితోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పేవారు కోకొల్లలు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ గురించి ఇంకో 100 ఏళ్ల తర్వాత ప్రస్తావన వచ్చినా అమితాబ్ పేరు లేకుండా పూర్తి కాదనడంలో సందేహమే లేదు. అంతలా చెరగని ముద్ర వేసిన అమితాబ్ పుట్టిన రోజు నేడు. 1942 అక్టోబర్ 11న జన్మించిన అమితాబ్ అసలు పేరు అమితాబ్ శ్రీవాత్సవ.
నేడు అమితాబ్ అంటే బిగ్‌బి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఎవరు సాటిలేరు, ఆయన సృష్టించిన రికార్డులకు లెక్కలేకపోవచ్చు.. కానీ ఒకప్పుడు మాత్రం అమితాబ్ ఎన్నో అపజయాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అమితాబ్ గొంతు ఒక బ్రాండ్ కానీ ఒకప్పుడు అదే గొంతును రిజక్ట్ చేశారు. నేడు అమితాబ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి తెలుసుకుందాం.. అమితాబ్ బచ్చన్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాన్ని పూర్తి చేసుకున్న వెంటనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. అయితే అమితాబ్ గొంతు వార్తలు చదవడానికి ఏమాత్రం పనికి రాదని తిప్పి పంపించేశారు.
View this post on Instagram
దీంతో అమితాబ్ కలకత్తా వెళ్లి అక్కడ బర్డ్ అండ్ కో లో బిజినెస్ రెప్రజెంటేటివ్‌గా పనిచేశారు. అదే సమయంలో అక్కడి థియేటర్ లోనూ నటించారు. ఆ అనుభవంతోనే అమితాబ్ చిత్రసీమలో ప్రవేశించారు. అయితే సినిమా ఆఫర్ల విషయంలో కూడా అమితాబ్‌కు ఎదురు దెబ్బలు తప్పలేవు. సినిమా ఆడిషన్స్‌లోనూ రిజక్ట్ అయ్యారు. 1968లో తాను ఓ సినిమా ఆఫర్ కోసం పంపించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అమితాబ్ ఆ సినిమాలో రిజక్ట్ అయినట్లు పేర్కొన్నారు. అయితే ఎన్ని కష్టాలు, అపజయాలు ఎదురైనా కష్టపడి, నిర్వీరామ కృషితో అమితాబ్ నేడు ఈ స్థాయికి ఎదిగారు. ఇలా సినిమాల్లో హీరోలాగే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు బిగ్‌బి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




