Dhanush-Aishwarya: మళ్లీ కలవనున్న ధనుష్ ఐశ్వర్య ?.. అసలు విషయం చెప్పేసిన హీరో తండ్రి..
ఈ ఏడాది ప్రారంభంలో తాను తన సతీమణి ఐశ్వర్య రజినీకాంత్‌తో విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చాడు. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. సౌత్ టూ నార్త్ వరుస సినిమాలు చేస్తూ అగ్రకథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ధనుష్. అయితే ఈ ఏడాది ప్రారంభంలో తాను తన సతీమణి ఐశ్వర్య రజినీకాంత్‌తో విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చాడు. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట డివోర్స్ తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. విడాకుల ప్రకటన అనంతరం ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయ్యారు. ధనుష్ సినిమాలతో బిజీ కాగా.. చాలా కాలం తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు ఐశ్వర్య. అయితే ఈ జంట తిరిగి కలిసిపోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పిల్లల కోసం వీరిద్దరు మళ్లీ కలుస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పై ధనుష్ తండ్రి కస్తూరి రాజు స్పందించారు.
ఇటీవల ఓ తమిళ్ ఇంటర్వూలో పాల్గోన్న ఆయనకు ధనుష్, ఐశ్వర్య డివోర్స్ ఆఫ్ గురించి ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయం పై నేరుగా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ తన కుమారుడు.. అతని భార్య.. పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరి మధ్య సయోద్య కోసం ధనుష్ తండ్రితోపాటు రజినీకాంత్ సైతం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. 2004లో రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్నారు ధనుష్. వీరికి యాత్ర రాజా, లింగరాజా ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల నానే వరవేన్, తిరుచిత్రంబలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం ధనుష్.. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ 1930 భారతదేశం నేపథ్యంలో ఉంటుంది.