Bigg Boss 6 Telugu: కోపంతో ఊగిపోయిన ఆదిరెడ్డి.. కొట్టుకునేందుకు సై అన్న రోహిత్.. ఇంట్లో నామినేషన్స్ హీట్..

ఇక ఈవారం నామినేషనలలో ఆది రెడ్డి, రోహిత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. మాటలతో మొదలైన వీరి లొల్లి కొట్టుకుంటారా అనే వరకు వెళ్లింది. అయితే ఒకరిపైకి మరోకరు దూసుకెళ్లినా.. మాకు సంబంధం లేదన్నట్లుగా మిగతా హౌస్మేట్స్ నిల్చోవడం గమనార్హం. కేవలం వాసంతి మాత్రం ఆదిరెడ్డిని అక్కడి నుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది.

Bigg Boss 6 Telugu: కోపంతో ఊగిపోయిన ఆదిరెడ్డి.. కొట్టుకునేందుకు సై అన్న రోహిత్.. ఇంట్లో నామినేషన్స్ హీట్..
Bigg Boss 6
Follow us

|

Updated on: Oct 11, 2022 | 8:10 AM

బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. ఆరో వారాలు కావోస్తున్న ఇప్పటివరకు హౌస్మేట్స్ ఆట తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికీ కొందరు ఆట మొదలు పెట్టకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చినప్పుడు మినహా.. మిగతా వారం మొత్తం టీఆర్పీ రేటింగ్ దారుణంగా ఉంటుంది. మరోవైపు.. గీతూ, ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ మినహా.. మిగతావారు గేమ్ ఆడుతున్నారో లేదా అనే సందేహాలు రావడం మాత్రం ఖాయం. ఇక నామినేషన్స్ ప్రక్రియ గురించి చెప్పాల్సిన పనిలేదు. నామినేషన్స్ సమయంలో కొందరు చెప్పే రీజన్స్ మాత్రం అస్సలు అర్థం కాకుండా ఉంటాయి. ఆరు వారాలు కావోస్తున్నా బిగ్ బాస్ 6లో ఎంటర్టైన్మెంట్ లేదనేది నిజం. ఇక ఈవారం నామినేషనలలో ఆది రెడ్డి, రోహిత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. మాటలతో మొదలైన వీరి లొల్లి కొట్టుకుంటారా అనే వరకు వెళ్లింది. అయితే ఒకరిపైకి మరోకరు దూసుకెళ్లినా.. మాకు సంబంధం లేదన్నట్లుగా మిగతా హౌస్మేట్స్ నిల్చోవడం గమనార్హం. కేవలం వాసంతి మాత్రం ఆదిరెడ్డిని అక్కడి నుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది.

నామినేట్ చేయాల్సిన ప్రతి ఇద్దరు ఇంటి సభ్యుల ముఖానికి ఫోమ్ రాసి సరైన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ముందుగా రేవంత్.. సుదీప, బాలాదిత్యలను నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత కీర్తి.. గీతూ, శ్రీసత్యలను నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆదిరెడ్డి.. మెరీనా, కీర్తిలను, సుదీప.. ఆదిరెడ్డి, కీర్తిలను నామినేట్ చేసింది. అలాగే శ్రీహాన్.. గీతూ, రాజ్ లను, వాసంతి.. గీతూ, ఆదిరెడ్డి, బాలాదిత్య.. గీతూ, రాజ్, సూర్య.. గీతూ, ఆదిరెడ్డి, ఫైమా. సుదీప, బాలాదిత్యలను.. ఇనయ.. శ్రీహాన్, కీర్తిలను నామినేట్ చేసింది. రాజ్.. గీ5తూ, బాలాదిత్య, గీతూ.. రాజ్, కీర్తి, అర్జున్.. కీర్తి, ఆదిరెడ్డిలను నామినేట్ చేయగా.. శ్రీసత్య… గీతూ, ఆదిరెడ్డిలను, మెరీనా.. కీర్తి, ఆదిరెడ్డిలను నామినేట్ చేసింది. ఇక మెరీనా నామినేషన్స్ సమయంలో ఆమె చెప్పిన కారణాలకు కోపంతో ఊగిపోయాడు ఆదిరెడ్డి.

అసలు మీరు కెప్టెన్ గా సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా ? అని మెరీనా ప్రశ్నించగా.. కేవలం పనిష్మెంట్ ఇవ్వడంలోనే ఫెయిల్ అయ్యానంటూ వాదించాడు ఆదిరెడ్డి. వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలోకి మెరీనా భర్త రోహిత్ ఎంటర్ అయ్యాడు. నేను మాట్లాడొచ్చా? అంటూ.. శుక్ర, శనివారాల్లో రూల్ ఏంటీ ? అడగ్గా.. బ్రో.. నేను చెప్పేది మీకు అర్థం కాలేదా అన్నాడు ఆదిరెడ్డి. దీంతో నువ్వు వాయిస్ రేజ్ చేస్తే నేను చేస్తా అంటూ అరిచేశాడు రోహిత్. వైఫ్ తో కలిసి ఆడడం కాదు.. నీ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడుతూ.. అంటూ మీది మీదికి వెళ్లాడు ఆదిరెడ్డి. నామినేట్ చేస్తే మీకు కోపం వస్తుందా ? అని ఆదిరెడ్డి అడగడంతో.. నామినేట్ చేయమని చెప్పడానికి మీరెవరు అంటూ రెచ్చిపోయాడు రోహిత్. ఇక వీరిద్దరు కోపంతో ఒకరిపైకి మరొకరు కొట్టుకుంటారా అనేట్టుగా వెళ్లిపోయారు. అయితే వీరిద్దరి గొడవ జరుగుతన్నప్పటికీ మాకేం సంబంధం లేదన్నట్టుగా చూస్తుండిపోయారు హౌస్మేట్స్. ఇక ఈ వారం నామినేట్ అయింది బాలాదిత్య, గీతూ, ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్, కీర్తి, రాజ్, శ్రీసత్య, మెరీనా.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..