అడ్మిట్ కార్డ్ కోసం వెళ్లిన విద్యార్థినికి షాకిచ్చిన యూనివర్సిటీ.. తన ఫోటోకు బదులుగా ఎవరిది పెట్టారంటే..
గ్జామ్స్ రాసేందుకు ప్రిపేర్ అయిన విద్యార్థి తన అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్ కోసం యూనివర్సిటీకి వెళ్లింది. అయితే అక్కడ తన అడ్మిట్ కార్డ్ పై ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యింది. ధ
ధన్బాద్లోని బినోద్ బిహారీ మహ్తో కోయలాంచల్ యూనివర్సిటీ ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి షాకిచ్చింది. ఎగ్జామ్స్ రాసేందుకు ప్రిపేర్ అయిన విద్యార్థి తన అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్ కోసం యూనివర్సిటీకి వెళ్లింది. అయితే అక్కడ తన అడ్మిట్ కార్డ్ పై ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యింది. ధనబాద్ కు చెందిన కాజల్ కుమారి అనే విద్యార్థి గతవారం మంగళవారం అర్థశాస్త్ర పరీక్ష రాయాల్సి ఉంది. అందుకు తన అడ్మిట్ కార్డ్ కోసం వెళ్లిన విద్యార్థి అందులో ఉన్న వివరాలను ఒక్కసారి చెక్ చేసుకుంది. తన గురించి పూర్తి వివరాలు సరిగ్గానే ఉన్నాయి.. కానీ తన ఫోటో ఉండాల్సిన స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పిక్ చూసి నోరెళ్లబెట్టింది. దీంతో తనను ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వరంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ సిబ్బందికి తెలియజేయగా.. దీనిపై విచారణ మొదలు పెట్టారు.
ఇది కేవలం సాంకేతిక లోపంగానే జరిగినట్లుగా భావిస్తున్నారు. తాను అడ్మిట్ కార్డ్ కోసం ఫారమ్ ఫిల్ చేసినప్పుడు డీటెయిల్స్ సరిగ్గానే ఉన్నాయని.. చివరి నిమిషంలో ఫోటో మారడం పట్ల సిబ్బంది తప్పు అని ఆరోపించింది సదరు విద్యార్థి. ఇదే విషయంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ శుక్ దేవ్ భోయ్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల అడ్మిట్ కార్డులో ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది. దీనిపై విచారణ చేస్తామని.. విద్యార్థినికి పరీక్షకు ఎలాంటి అడ్డంకు రాకుండా చూసుకుంటామని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
మరోవైపు విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న ఏజేఎస్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విశాల్ మహ మాట్లాడుతూ.. యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయగా, విద్యార్థి చిత్రానికి బదులుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటో , సంతకం చేసిన అడ్మిట్ కార్డ్ జారీ చేయబడింది.
ఆ తర్వాత మళ్లీ వెతికితే అక్కడ మరో అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. అయితే అడ్మిట్ కార్డ్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ రెండవ చిత్రం ఉంది. యూనివర్సిటీ తప్పిదమా లేక యూనివర్సిటీ వెబ్‌సైట్ హ్యాక్ చేయబడిందా అనే విషయంపై విచారణ చేయాలన్నారు.