Aamir Khan: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఆమిర్ ఖాన్.. ఆ ఫేమస్ క్రిమినల్ లాయర్ బయోపిక్‌తో రీ ఎంట్రీ
గతేడాది అమీర్ ఖాన్-కరీనా కపూర్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' విడుదలైంది. ఇంగ్లిష్ చిత్రం 'ఫారెస్ట్ గంప్'కి హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొద్దిరోజలు పాటు నటనకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించాడు ఆమీర్ ఖాన్. అయితే తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. త్వరలోనే తన కొత్త సినిమాను

బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ ఆమీర్ ఖాన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. తను నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడంతో కొద్దికాలం పాటు నటనకు విరామం పలికాడు . 2018లో తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రాన్ని 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమా కేవలం 150 కోట్ల రూపాయలను మాత్రమే కలెక్ట్ చేసింది. అలాగే గతేడాది అమీర్ ఖాన్-కరీనా కపూర్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలైంది. ఇంగ్లిష్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొద్దిరోజలు పాటు నటనకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించాడు ఆమీర్ ఖాన్. అయితే తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. త్వరలోనే తన కొత్త సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఆమిర్ ఖాన్ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుందని కూడా అంటున్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో పనులు జరుగుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏడాది పాటు విరామం..
కాగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 129 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. ఇలా వరుసగా పరాజయాలు రావడంతో అమీర్ ఖాన్ నటనకు దూరం అయ్యాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. మధ్యమధ్యలో నేపాల్ వెళ్లి ధ్యాన శిబిరంలో పాల్గొన్నారు. నవంబర్ 2022 లో ఒక ప్రకటన విడుదల చేసిన ఆమిర్ ఖాన్.. ’35 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నిరంతరం పనిచేస్తున్నాను. దీంతో కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నటనకు విరామం ఇవ్వబోతున్నాను. అయితే నటించడం కాకుండా నిర్మాతగా యాక్టివ్‌గా ఉంటాను’ అని అందులో తెలిపారు.




#Xclusiv… AAMIR KHAN LOCKS CHRISTMAS 2024 FOR NEXT FILM… Aamir Khan Productions’ Prod No. 16 [not titled yet], starring #AamirKhan in the lead role, to release on 20 Dec 2024 #Christmas2024.
Pre-production of the film is ongoing and the film goes on floors on 20 Jan 2024…… pic.twitter.com/wAMIvPL60D
— taran adarsh (@taran_adarsh) August 29, 2023
ఉజ్వల్ నికమ్ బయోపిక్ లో.
కాగా ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ బయోపిక్ తీయడానికి ఆమిర్ ఖాన్ దినేష్ విజన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ గురించి చాలా చర్చలు జరిగాయి. ఇందులో చాలా మంది నిర్మాతలు డబ్బు పెట్టుబడి పెట్టబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 2024లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. అయితే ఉజ్వల్ నికమ్ పాత్రలో ఆమిర్ ఖాన్ స్వయంగా కనిపిస్తారా లేక మరెవరైనా నటిస్తారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే..
A nostalgic throwback to ‘Lagaan’ as we celebrate its 22-year milestone, reliving the moments that made it an iconic part of the Indian cinema. ❤️#AamirKhan #GracySingh #RachelShelley #AdityaLakhia #YashpalSharma #Raghubir #PaulBlackthorne pic.twitter.com/ZkbbgQGokr
— Aamir Khan Productions (@AKPPL_Official) June 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..