Gadar 2: రక్షా బంధన్ స్పెషల్.. ‘గదర్ 2’ టికెట్లపై బంపరాఫర్.. 2 టికెట్స్ కొంటె 2 ఫ్రీ.. ఎప్పటివరకంటే?
సీనియర్ హీరో, హీరోయిన్లు సన్నీ డియోల్, అమీసా పంటేల్ జంటగా నటించిన తాజా చిత్రం 'గదర్ 2'. ఇండో- పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో 2001లో రిలీజైన సూపర్ హిట్ సినిమా 'గదర్: ఏక్ ప్రేమ్ కహానీ' సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అనిల్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గదర్ 2 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

సీనియర్ హీరో, హీరోయిన్లు సన్నీ డియోల్, అమీసా పంటేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘గదర్ 2’. ఇండో- పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో 2001లో రిలీజైన సూపర్ హిట్ సినిమా ‘గదర్: ఏక్ ప్రేమ్ కహానీ’ సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అనిల్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గదర్ 2 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ. 60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ. 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ధాటికి బాహుబలి 2, కేజీఎఫ్, పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ల సినిమాల రికార్డులున్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాగా రక్షాబంధన్ పండగను పురస్కరించుకుని ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ టికెట్లపై బంపరాఫర్ ప్రకటించింది. ఈ పర్వదినాన గదర్ 2 సినిమాకు వెళ్లాలనుకునేవారికి 2 టికెట్లు బుక్ చేసుకుంటే మరో 2 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం (GADAR 2) ప్రోమో కోడ్‌ను వినియోగించుకోవాలని సోషల్ మీడియా వేదికగా సూచించింది. ఆగస్టు 30తో మొదలయ్యే ఈ ఆఫర్ సెప్టెంబర్ 3 వరకు అందుబాటులో ఉంటుందని బుక్ మై షో తెలిపింది.
జీ స్టూడియోస్ బ్యానర్‌తో కలిసి డైరెక్టర్ అనిల్ శర్మ గదర్ 2 సినిమాను నిర్మించారు. సన్నీడియోల్, అమీషాతో పాటు ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా, మనిష్ వాద్వా, మనోజ్ భక్షి, సిమ్రత్ కౌర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిథూన్ స్వరాలు సమకూర్చాగా, సయీద్ క్వాద్రీ లిరిక్స్ సమకూర్చారు. నజీబ్ ఖాన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కాగా రిలీజ్‌కు ముందు గదర్ 2 సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. పైగా సన్నీ డియోల్, అమీషా పటేల్‌కు కూడా గత కొన్నేళ్లుగా సరైన హిట్లు లేవు. అలాగే సినిమాపై కూడా వివాదాలు చెలరేగాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య రిలీజైన గదర్ 2 ఏకంగా బాక్సాఫీస్ రికార్డులనే తిరగరాస్తుండడం విశేషం. మరి రక్షాబంధన్ రోజున మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమా చూడాలంటే గదర్ 2 మంచి ఛాయిస్. పైగా 2+2 ఆఫర్ కూడా ఉంది.




Iss Raksha Bandhan, kijiye poore parivaar ke liye kuch khaas!
Book karein tickets under the ongoing offer of Buy 2 Get 2 using the code – GADAR2
*This offer ends on 3rd September, 2023.#Gadar2 in cinemas now. 🎞️@ZeeStudios_ @Gadar_Official… pic.twitter.com/3ih5cxEVQm
— Ramesh Bala (@rameshlaus) August 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..