Ananya panday: అందరికీ కనిపించే విజయ్ వేరు, అసలు విజయ్ వేరు.. రౌడీ హీరోపై బాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ananya panday: విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను దక్కించుకున్నారు. ఈ సినిమాలో విజయ్ మార్క్ యాక్టింగ్ అతన్ని ఒక్కరోజులో స్టార్ హీరోగా మార్చేసింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డిలో విజయ్ ఆటిట్యూడ్‌కి యంగ్ జనరేషన్ ఫిదా అయ్యింది....
Ananya panday: విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను దక్కించుకున్నారు. ఈ సినిమాలో విజయ్ మార్క్ యాక్టింగ్ అతన్ని ఒక్కరోజులో స్టార్ హీరోగా మార్చేసింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డిలో విజయ్ ఆటిట్యూడ్‌కి యంగ్ జనరేషన్ ఫిదా అయ్యింది. ఇక ప్రస్తుతం లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ జెండా పాతడానికి సిద్ధమవుతున్నారు విజయ్. ఇప్పటికే విజయ్ పేరు బీటౌన్‌లో తెగ హల్చల్ చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ చిత్రంలో విజయ్‌కు జోడిగా అనన్య పాండే నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవల నటించిన గెహ్రెయాన్ అనే సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఇంటర్వ్యూలో అనన్య, విజయ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ సినిమాల్లో కనిపించే దానికి, బయట పూర్తి భిన్నంగా ఉంటాడు. విజయ్ నిజానికి చాలా పిరికివాడు. అతను నటించిన అర్జున్ రెడ్డి నాకు చాలా ఇష్టం. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ పాత్రకు, బయట తన వ్యక్తిత్వానికి అసలు పొంతనే ఉండదు’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. దీంతో అనన్య చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పిరికివాడని అనన్య అనడంలో నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే లైగర్ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ముంబయికి చెందిన ఓ చాయ్ వాలా అంతర్జాతీయ బాక్సర్‌గా ఎలా ఎదిగాడన్న కథాంశం ఆధారంగా దర్శకుడు పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత పూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా, విజయ్ తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో లైగర్‌పై ఎక్కడలేని అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసింది.
Also Read: టార్గెట్ 2024.. వేడెక్కుతున్న ఢిల్లీ రాజకీయం.. సోనియా ఆధ్వర్యంలో మరో కీలక భేటీ..!