Samantha Yashoda: సమంత సినిమా కోసం భారీ సెట్‌.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Samantha Yashoda: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం యశోద. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి-హరిష్‌ దర్శకులిగా పరిచయం అవుతున్నారు. ఇంకా నిర్మాణం పూర్తి కానీ ఈ సినిమాపై ఇప్పటి నుంచే..

Samantha Yashoda: సమంత సినిమా కోసం భారీ సెట్‌.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Yashoda Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2022 | 3:32 PM

Samantha Yashoda: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం యశోద. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి-హరిష్‌ దర్శకులిగా పరిచయం అవుతున్నారు. ఇంకా నిర్మాణం పూర్తి కానీ ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో తమిళ నటీమణి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా కోసం చిత్ర యూనిట్‌ తాజాగా ఓ భారీ సెట్‌ను నిర్మించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో హోటల్‌ సెట్‌ కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు చేస్తుండడం విశేషం. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సెట్ నిర్మాణానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ భారీ సెట్ గురించి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘యశోద సినిమా చిత్రీకరణ 30 నుంచి 40 శాతం ఒకే హోటల్‌లో షూటింగ్ జరుపుకోనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని చాలా హోటల్స్‌ చూశాం. అయితే సుమారు 40 రోజుల పాటు హోటల్‌లో చిత్రీకరణ జరపడం అంత సులభమైన విషయం కాదు. అందుకే సీనియర్‌ కళా దర్శకుడు అశోక్‌ నేతృత్వంలో సెట్స్‌ రూపొందిస్తున్నాం. సెట్‌లో భాగంగా డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ… సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోంది’ అని చెప్పుకొచ్చారు.

యశోద సెట్‌ నిర్మాణ వీడియో..

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్‌ చివరి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ఉన్న చిత్ర యూనిట్‌ ఈ సమ్మర్‌కు విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తోంది. క్లైమాక్స్‌ సన్నివేశాలను కొడైకెనాల్‌లో ప్లాన్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యశోద చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇక ఒక్కడు సినిమాలో చార్మినార్‌ సెట్‌ వేసిన అశోక్‌, యశోద హోటల్‌ సెట్‌కు ప్లానింగ్‌ వేయడం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా సమంత కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Samantha

Also Read: Andhra Pradesh: సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం

East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..

Health Tips: ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటికి దూరంగా ఉండండి.. అవేంటంటే..