Anupama parameswaran: జీవితంలో నేను కోరుకునేది అదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అనుపమ పరమేశ్వరన్.
Anupama parameswaran: జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా జీవించినా చివరికి ప్రతీ ఒక్కరూ కోరుకునేది ప్రశాంతంగా జీవించడం. ఆనందగా జీవించడానికి మనిషి ప్రయత్నిస్తుంటాడు. అందుకోసమే ఆరాటపడుతుంటారు. తాను కూడా...
Anupama parameswaran: జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా జీవించినా చివరికి ప్రతీ ఒక్కరూ కోరుకునేది ప్రశాంతంగా జీవించడం. ఆనందగా జీవించడానికి మనిషి ప్రయత్నిస్తుంటాడు. అందుకోసమే ఆరాటపడుతుంటారు. తాను కూడా అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాను అని చెబుతోంది అందాల తార అనుపమ పరమేశ్వరన్. 2015లో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ. తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది తన అందంతో మెస్మరైజ్ చేసింది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఇక్కడ కూడా నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా కార్తికేయ సీక్వెల్, 18 పేజెస్, హెలెన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.
View this post on Instagram
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ చిన్నది పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా తన బలం, బలహీనతల గురించి మాట్లాడిన ఈ చిన్నది.. ‘నాకు చాలా త్వరగా కోపం వస్తుంది. కానీ అంతే త్వరగా పోతుంది. నేను జీవితంలో ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటా. హాయిగా నవ్వుతూ, ఆనందంగా ఉండటమే నాకు ఇష్టం. అందుకే వీలైనంతవరకు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తుంటా’ అని చెప్పుకొచ్చింది. ఇక తనకు అభిమానుల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయని తెలిపిన అనుపమ, వాటికి సమాధానం ఇస్తానని తెలిపింది. దీనికి కారణాన్ని వివరిస్తూ.. అభిమానులు టైం తీసుకుని మెసేజ్‌లు చేస్తుంటారు కాబట్టి, వారి టైంకు విలువ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటా’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
View this post on Instagram
Health Tips: మీకు ఎసిడిటీ సమస్య ఉందా..? ఈ చిట్కాలతో అద్భుతమైన ప్రయోజనం..!
PF డబ్బులు అకౌంట్లోనే స్ట్రక్ అయిపోయాయా..? అయితే ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా..