AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: ఆ సినిమాకు నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శృతి హాసన్

అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శృతి హాసన్. ఆతరువాత చాలా కాలం ఈ బ్యూటీ సరైన హిట్ అందుకోలేక పోయింది.

Shruti Haasan: ఆ సినిమాకు నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శృతి హాసన్
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2022 | 4:34 PM

Share

Shruti Haasan: అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శృతి హాసన్. ఆతరువాత చాలా కాలం ఈ బ్యూటీ సరైన హిట్ అందుకోలేక పోయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత శృతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది శృతిహాసన్. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఈ చిన్నది లక్కీ లేడీగా మారిపోయింది. తెలుగు తోపాటు తమిళ్ లోనూ సినిమా చేసింది ఈ బ్యూటీ. అలాగే బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ బాలీవుడ్ లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్న శృతి ఆతర్వాత క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.

రవితేజ నటించిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. అలాగే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న బాలయ్య 107 సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందట శృతి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఏ సినిమాకు తన పై ఎక్కువ ట్రోల్స్ వచ్చాయని ప్రశ్నించగా.. శృతి స్పందిస్తూ.. తెలుగులో నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాకు తన పై ఎక్కువ ట్రోల్స్ వచ్చాయని తెలిపింది. ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలించిన ప్రేమమ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. మలయాళంలో సాయిపల్లవి నటించిన మలర్ పాత్రలో ఇక్కడ శృతి నటించింది. మలర్ పాత్రకోసం నన్ను సంప్రదించినప్పుడు  ఆ పాత్ర బాగా నచ్చినా.. ఒక్క క్షణం మాత్రం చేయకూడదనుకున్నా.. కాస్త ఆలోచించి ఓకే చెప్పేశా” అయితే సాయిపల్లవిని మరిపించేలా నటించాలని అనుకోలేదు. అయినా కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారు అని చెప్పుకొచ్చింది. అదృష్టం కొద్దీ ఆసినిమా మంచి విజయాన్ని అందుకుంది..ఏ  పాత్ర అయినా సరే సవాలుగా తీసుకుంటా.. నా శైలిలో చేయాలని మలర్ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నా అని తెలిపింది శృతి హాసన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Ghattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..

Viral Photo: చారడేసి కళ్లు.. బూరె బుగ్గల ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపై ఈ చిన్నదానిదే హవా..

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!!.. శాకుంతలం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్