Bigg Boss 4: జోర్దార్ సుజాత ఔట్.. అతడిపై బిగ్ బాంబ్
ఎప్పటిలాగే ఆదివారం నాటి ఎపిసోడ్ ఫన్‌గా జరిగింది. అనారోగ్యం కారణాల వలన శనివారం గంగవ్వను బయటకు పంపేయగా

Jordar Sujatha eliminated: ఎప్పటిలాగే ఆదివారం నాటి ఎపిసోడ్ ఫన్‌గా జరిగింది. అనారోగ్యం కారణాల వలన శనివారం గంగవ్వను బయటకు పంపేయగా.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో జోర్దార్ సుజాత బయటకు వచ్చేశారు. ఈ వారం ఎలిమినేషన్‌లో మొత్తం 9 మంది ఉండగా.. గంగవ్వ వెళ్తూ అఖిల్‌ని సేవ్ చేసింది. సొహైల్‌ని నాగార్జున సేవ్ చేశారు. ఇక మోనాల్, అభిజిత్, అమ్మ రాజశేఖర్, జోర్దార్ సుజాత, లాస్య, నోయల్, అరియానా మిగిలారు. వీరిలో ఎలిమినేషన్ ప్రాసెస్‌లో చివరికి అమ్మ రాజశేఖర్, జోర్దార్ సుజాత మిగిలారు. వాళ్లద్దరికీ ఐస్ బార్‌ని పగలగొట్టే టాస్క్ ఇచ్చిన నాగ్ అందులో ఉన్న ఫొటోగ్రాఫ్‌ని తీయమన్నారు. ఇద్దరూ కలిసి దాన్ని పగలగొట్టగా ఫొటోగ్రాఫ్ రాజశేఖర్ మాస్టర్‌కు చిక్కింది. దానిపై సుజాత పేరు ఉంది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. దీంతో నా చేతులతోనే పంపేస్తున్నానే అంటూ అమ్మ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యి, కంటతడి పెట్టారు.
ఇక హౌజ్ నుంచి బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన సుజాత తన గురించి మాట్లాడింది. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదని, అయినా అనుకోనిది జరిగితేనే బిగ్‌బాస్ హౌజ్ అవుతుంది కదా అంటూ సర్దిచెప్పుకుంది. నేను ఎలా ఉంటానో అలానే ఉండేటట్లు బిగ్‌బాస్ చేసింది. హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏదో ఒక నౌకరి చేసుకుంటాను. మా అమ్మవాళ్లకు బిడ్డ అన్నట్లుగా ఉంటానని అనుకున్నాను. కానీ ఈరోజు నా విషయంలో వాళ్లు చాలా సంతోషంగా ఉండే స్థాయికి వచ్చాను. అది బిగ్‌బాస్ వలన. అదే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది అని సుజాత ఎమోషనల్ అయ్యింది. ఇక వెళ్తూ వెళ్తూ సుజాత బిగ్ బాంబ్‌ని కెప్టెన్ సొహైల్‌పై వేసి వెళ్లింది. ఆ బాంబ్ ప్రకారం.. ఈ వారం మొత్తం హౌజ్‌లోని గిన్నెలు అన్నీ సొహైల్ తోమాలి.
Read More:



