డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమిర్ ఖాన్ తనయ !
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. 'వరల్డ్ మెంటల్ హెల్త్ డే' సందర్భంగా శనివారం ఓ వీడియోను పోస్ట్ చేసింది.

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ‘వరల్డ్ మెంటల్ హెల్త్ డే’ సందర్భంగా శనివారం ఓ వీడియోను పోస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం గురించి ఫాలోవర్లతో మాట్లాడింది.తాను నాలుగేళ్ల నుంచి డిప్రెషన్లో ఉన్నట్లు తెలిపింది. డాక్టర్ నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటున్నానని.. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వివరించింది. ఏడాది నుంచి మెంటల్ పీస్ కోసం ఏదో చేయాలని అనుకుంటున్నాను… కానీ ఏం చేయాలో తెలియట్లేదని పేర్కొంది. ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయని, ఎంతోమంది తమ మనసులోని విషయాల్ని చెప్పాలనుకుంటున్నారని తెలిపింది. ఆ విషయాలన్నీ గందరగోళంగా, ఒత్తిడితో ఉన్నాయని, మనమంతా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుదాం అని ఇన్‌స్టాలో ఐరా ఖాన్ వీడియో పోస్ట్ చేసింది. గత కొంతకాలంగా పలురకాల పనులు చేస్తూ బిజీగా ఉంది ఐరా. లాక్డౌన్లో టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )