తల్లి కాబోతున్న ‘నువ్వు నేను’ మూవీ హీరోయిన్
తెలుగు బ్లాక్‌బాస్టర్ హిట్ మూవీ 'నువ్వు నేను' ఫేమ్ హీరోయిన్ అనిత.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు బ్లాక్‌బాస్టర్ హిట్ మూవీ ‘నువ్వు నేను’ ఫేమ్ హీరోయిన్ అనిత.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నానంటూ తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్త రోహిత్‌తో ప్రేమ నుంచి ప్రెగ్నెన్సీ వరకు ఉన్న ప్రయాణాన్ని డిఫరెంట్ పద్దతిలో చూపింది. (Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )
బుల్లితెరతో నటిగా కెరీర్ ప్రారంభించిన అనిత.. ‘నువ్వు నేను’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘శ్రీరామ్’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘నేను పెళ్ళికి రెడీ’, ‘తొట్టి గ్యాంగ్’ లాంటి సినిమాల్లో నటించింది. అనంతరం తెలుగు టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి బాలీవుడ్లో పలు పాపులర్ షోలతో పాటు సినిమాల్లో నటించింది.