జోరు చూపిస్తోన్న కాలభైరవ
కాల భైరవ.. ఇప్పుడు ఈ పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ముందు కీరవాణి కొడుకుగానే అందరూ అతడికి అవకాశాలు వస్తున్నాయని భావించారు.

కాలభైరవ.. ఇప్పుడు ఈ పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ముందు కీరవాణి కొడుకుగానే అందరూ అతడికి అవకాశాలు వస్తున్నాయని భావించారు. ఇప్పుడు మాత్రం తన మార్క్ చాటుకుంటూ, వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. ‘బాహుబలి-2’లో అతడు పాడిన దండాలయ్యా పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తండ్రిని పోలిన గాత్రంతో ఆయన శ్రోతలను అలరించారు.
ఆ తర్వాత అరవింద సమేతలో పెనివిటి పాట పాడి తన మార్క్ చూపించారు. అలా వరుసగా పాటలు పాడుతున్న కాలభైరవ సింగర్‌గా కొనసాగుతారేమో అని అందరూ భావించారు. కానీ తన సోదరుడు సింహా హీరోగా పరిచయమైన మత్తు వదలరా సినిమాకి సంగీత దర్శకుడిగా మారి ఆశ్చర్యపరిచారు. నేపథ్య సంగీతం కీలకంగా మారిన ఆ థ్రిల్లర్ సినిమాతో కాలభైరవ తన పనితనాన్ని ఇండస్ట్రీకి చూపించారు. దీంతో ఇప్పుడు అతడికిి సంగీత దర్శకుడిగా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది కాలభైరవ సంగీత దర్శకుడిగా మూడు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అందులో ఒకటి.. కలర్ ఫోటో. నటుడు సుహాస్ హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయిరాజేష్ నిర్మించిన చిత్రమిది. ఇప్పటికే రిలీజైన సినిమా పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సంగీత దర్శకుడిగా కాలభైరవ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇదవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )